Thursday, April 25, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 11, శ్లోకం 36
36.
అర్జున ఉవాచ
స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా
జగత్ప్రహృష్‌యత్యనురజ్యతే చ |
రక్షాంసి భీతాని దిశో ద్రవంతి
సర్వే నమస్యంతి చ సిద్ధసంఘా: ||

తాత్పర్యము : అర్జునుడు పలికెను : ఓ హృషీకేశ! నీ నామమును వినినంతనే లోకమంతయు సంతోషించి, ప్రతి యొక్కరు నీ యెడ అనురక్తులగుచున్నారు. సిద్ధసమూహములు నీకు గౌరవ పూర్వకముగా అంజలి ఘటించుచున్నను రాక్షసులు భీతి చెందినవారై పలుదిక్కుల పలాయనమగుచున్నారు. ఇది యంతయు యుక్తముగనే ఉన్నది.

భాష్యము : కురుక్షేత్ర రణరంగపు అంతిమ తీర్పును విన్న తరువాత అర్జునుడు ఎంతో ఆనందముతో భక్తుడుగా సఖుడుగా కృష్ణున్ని కీర్తించెను. కృష్ణుడు చేసేదంతా సరియేనని కొనియాడెను. కృష్ణుడు, దుష్టులను శిక్షించి భక్తులను రక్షిస్తాడని, ఇది అందరికి మంచినే చేకూరుస్తుందని నిర్ధారించెను. కురుక్షేత్ర రణరంగ సమయమున దేవతలు, సిద్ధులు, మునులు ఆకాశములో ఉండి యుద్ధమును తిలకించిరి విశ్వరూప దర్శనమును నందు దేవతలు ఆనందమునొందగా, దానవులు, నాస్తికులు ఆ కాల భైరవుడిని చూసి పారిపోయెను. కృష్ణుడు ఏది చేసినా అది అందరికీ మంచినే చేకూరుస్తుందని తెలిసిన భక్తుడు ఎల్లప్పుడూ భగవంతుని కార్యాలను కొనియాడుచూ ఉండును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …

అధ్యాయం 11, శ్లోకం 36
36.
అర్జున ఉవాచ
స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా
జగత్ప్రహృష్‌యత్యనురజ్యతే చ |
రక్షాంసి భీతాని దిశో ద్రవంతి
సర్వే నమస్యంతి చ సిద్ధసంఘా: ||

- Advertisement -

తాత్పర్యము : అర్జునుడు పలికెను : ఓ హృషీకేశ! నీ నామమును వినినంతనే లోకమంతయు సంతోషించి, ప్రతి యొక్కరు నీ యెడ అనురక్తులగుచున్నారు. సిద్ధసమూహములు నీకు గౌరవ పూర్వకముగా అంజలి ఘటించుచున్నను రాక్షసులు భీతి చెందినవారై పలుదిక్కుల పలాయనమగుచున్నారు. ఇది యంతయు యుక్తముగనే ఉన్నది.

భాష్యము : కురుక్షేత్ర రణరంగపు అంతిమ తీర్పును విన్న తరువాత అర్జునుడు ఎంతో ఆనందముతో భక్తుడుగా సఖుడుగా కృష్ణున్ని కీర్తించెను. కృష్ణుడు చేసేదంతా సరియేనని కొనియాడెను. కృష్ణుడు, దుష్టులను శిక్షించి భక్తులను రక్షిస్తాడని, ఇది అందరికి మంచినే చేకూరుస్తుందని నిర్ధారించెను. కురుక్షేత్ర రణరంగ సమయమున దేవతలు, సిద్ధులు, మునులు ఆకాశములో ఉండి యుద్ధమును తిలకించిరి విశ్వరూప దర్శనమును నందు దేవతలు ఆనందమునొందగా, దానవులు, నాస్తికులు ఆ కాల భైరవుడిని చూసి పారిపోయెను. కృష్ణుడు ఏది చేసినా అది అందరికీ మంచినే చేకూరుస్తుందని తెలిసిన భక్తుడు ఎల్లప్పుడూ భగవంతుని కార్యాలను కొనియాడుచూ ఉండును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …

Advertisement

తాజా వార్తలు

Advertisement