Saturday, April 20, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 10
10.
న ద్వేష్ట్యకుశలం కర్మ
కుశలే నానుషజ్జతే |
త్యాగీ సత్త్వసమావిష్టో
మేధావీ ఛిన్న సంశయ: ||

10. తాత్పర్యము : అశుభకర్మల యెడ ద్వేషము గాని, శుభకర్మల యెడ సంగత్వము గాని లేనట్టి సత్త్వ గుణస్థితుడగు బుద్ధిమంతుడైన త్యాగికి కర్మయెడ ఎట్టి సంశయములు ఉండవు.

భాష్యము : కృష్ణ భక్తి రసభావన యందున్నవాడు తన దేహమునకు కష్టము కలిగించు విషయములను గాని, మనుజులను గాని ద్వేషించడు. విద్యుక్త ధర్మ పాలనము వలన కలిగెడి కష్టములకు భయపడక తగిన సమయమున మరియు తగిన ప్రదేశమున అట్టివాడు కర్మను ఒనరించును. దివ్యస్థితిలో నిలిచియున్న అట్టివాడు అత్యంత మేధాసంపన్నుడనియు మరియు తానొనరించు కర్మల యెడ సంశయరహితుడనియు తెలిసికొనవలెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement