Saturday, April 20, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 9
9.
కార్యమిత్యేన యత్కర్మ
నియతం క్రియతే ర్జున |
సంగం త్యక్త్వా ఫలం చైవ
స త్యాగ: సాతి ్త్వకో మత: ||

తాత్పర్యము : ఓ అర్జునా! తప్పక ఒనరింపవలసియే యున్నందున తన స్వధర్మమును నిర్వహించుచు, సమస్త భౌతిక సంగమును మరియు ఫలాశక్తిని విడుచువాని త్యాగము సాత్వ్తిక త్యాగమనబడును.

భాష్యము : విద్యుక్తధర్మములను ఇట్టి భావనలోనే నిర్వహింపవలెను. మనుజుడు ఫలముల యెడ ఆసక్తి లేకుండా వర్తింపవలెను. అంతేకాక అతడు గుణముల నుండియు విడివడియుండవలెను. కృష్ణభక్తిరసభావితుడైన వ్యక్తి ఏదేని కర్మాగారములో పనిచేయుచున్నచో, కర్మాగారపు పనినే సర్వస్వమని తలచుట గాని, కర్మాగారమునందలి కార్మికులతో అనవసర సాంగత్యము కలిగియుండుట గాని చేయడు. కేవలము కృష్ణుని నిమిత్తమే అతడు కర్మను ఒనరించును. ఫలమును కృష్ణునికే అర్పించినపుడు అతడు దివ్యముగా వర్తించినవాడగుతాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement