Friday, March 29, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 77
77.
తచ్చ సంస్మృత్య సంస్మృత్య
రూపమత్యద్భుతం హరే: |
విస్మయో మే మహాన్‌ రాజన్‌
హృష్యామి చ పున:పున: ||

తాత్పర్యము : ఓ రాజా! అత్యద్భుతమైన శ్రీకృష్ణ భగవానుని రూపమును స్మరించిన కొలది నేను అత్యంత విస్మయము నొందుచు మరల మరల ఆనందమును అనుభవించుచున్నాను.

భాష్యము : ఈ శ్లోకమును బట్టి సంజయుడు కూడా శ్రీకృష్ణుని విశ్వరూపమును చూసినట్లు అర్థమగుచున్నది. అటువంటి రూపమును ఇంతకు ముందు ఎవరూ చూసి ఉండలేదు. అనగా అర్జునునికి చూపించినప్పుడు, వేరే కొంత మంది గొప్ప భక్తులు కూడా చూశారని అర్థమగుచున్నది. వ్యాసదేవుడు శ్రీకృష్ణుని గొప్పభక్తుడే కాక భగవంతుని అవతారము కూడా. అందువలన ఆయన కూడా విశ్వరూపాన్ని దర్శించి తన శిష్యుడైన సంజయునికి కూడా చూపించెను. ఆ విశ్వరూపాన్ని తలచుకుని సంజయుడు మరల మరల ఆనంద పరవశుడగుచున్నాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement