Saturday, April 20, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 58
58.
మచ్చిత్త: సర్వదుర్గాణి
మత్ప్రసాదాత్‌ తరిష్యసి |
అథ చేత్‌ త్వమహంకారాత్‌
న శ్రోష్యసి వినంక్ష్యసి ||

తాత్పర్యము : నా యందు చిత్తమ గలవాడవైన చో నా కరుణచే బద్ధజీవ నపు ఆటంకముల నన్నింటిని దాటగలవు. కాని ఒక వేళ నా మాట వినక అట్టి భావనలో గాక మిథ్యాహంకారముతో వర్తించితివేని తప్పక వినాశము పొందగలవు.

భాష్యము : బద్ధ జీవుడు తనకు ఏది మంచో ఏది చెడో తెలసుకోలేని స్థితిలో ఉంటాడు. అదే కృస్న చైతన్యములో కృష్ణుని ఆదేశానుసారము కార్యములు చేసినట్లయితే ఎటువంటి ఆందోళనకు గురి కావలసిన అవసరం ఉండదు. అంతేకాక శ్రీకృష్ణుడు అటువంటి వ్యక్తిని తన ఆప్త మిత్రునిగా స్వీకరించి అతనికి కావలసిన అన్ని సౌకర్యములనూ సమకూరుస్తాడు. అలాకాక అహంకారముతో శరీర భావనలో ప్రవర్తించినట్లయితే భౌతిక ప్రకృతి నియమాలకు లోనై జన్మ మృత్యు సాగరములో పడిపోతాడు. అదే పరమాత్మ రూపములో కృష్ణుడు ఇచ్చే సూచనలను, గురువు ఆజ్జ మేరకు నిర్వహించినట్లయితే అన్ని కలతల నుండి ఒక్కసారిగా ముక్తుడు కాగలుగుతాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement