Thursday, April 25, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 33
33.
ధృత్యా యయా ధారయతే
మన:ప్రాణంద్రియక్రియా: |
యోగేనావ్యభిచారిణ్యా
ధృతి: సా పార్థ సాత్త్వికీ ||

తాత్పర్యము : ఓ పృథుకుమారా! అవిచ్చన్నమైనదియు, యోగాభ్యాసముచే స్థిరముగా కొనసాగునదియు, తత్కారణముగా ఇంద్రియ, మనో, ప్రాణముల కార్యములను నియమించునదియు అయిన నిశ్చయము సత్త్వ గుణప్రధానమైనది.

భాష్యము : ‘యోగము’ పరమాత్మను అవగాహన చేసుకొనుటకు ఒక సాధనము. తన మనస్సును, ప్రాణమును, ఇంద్రియములను పరమాత్మ యందు కేంద్రీకరించి, ధృఢనిశ్చయముతో నుండు వాడు కృష్ణ చైతన్యమున నెలకొనినవాడగును. అట్టి స్థిర నిశ్చయము సత్వగుణమునకు సంబంధించినది. ‘అవ్యభిచారిణ్యా’ అను పదము మిక్కిలి ముఖ్యమైనది. ఎందుకనగా కృష్ణ చైతన్యము నెలకొనినవాడు ఏ ఇతర కార్యముల చేతను పెడత్రోవపట్టరని ఈ పదము సూచించుచున్నది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement