Friday, April 19, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 31
31.
యయా ధర్మమధర్మం చ
కార్యం చాకార్యమేవ చ |
అయథావత్‌ ప్రజానాతి
బుద్ధి: సా పార్థ రాజసీ ||

తాత్పర్యము : ఓ పార్థా! ధర్మము మరియు అధర్మము నడుమగల భేదమును గాని, చేయవలసిన కార్యము మరియు చేయకూడని కార్యము నడుమ గల భేదమును గాని తెలియలేనటువంటి బుద్ధి రాజసిక బుద్ధి అనబడును.

భాష్యము : లేదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement