Wednesday, April 17, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 27
27.
రాగీ కర్మఫలప్రేప్సు:
లుబ్దో హింసాత్మకో శుచి: |
హర్షశోకాన్విత: కర్తా
రాజస: పరికీర్తిత: ||

తాత్పర్యము : కర్మఫలములను అనుభవింపగోరుచు కర్మ మరియు కర్మ ఫలముల యెడ ఆసక్తుడై యుండువాడును, లోభియును, అసూయపరుడును, శుచిరహితుడును, సుఖదు:ఖములచే చలించువాడును అగు కర్త రజోగుణకర్త అనబడును.

భాష్యము : ఇల్లు, భార్య, పిల్లల పట్ల ఎంతో మమకారము కలిగిన వ్యక్తి తాను చేసే కార్యము పట్ల దాని నుండి వచ్చే ఫలితము పట్ల ఎంతో ఆసక్తిని కలిగి ఉంటాడు. ఉన్నత చైతన్యము పట్ల ఆసక్తిని కలిగి ఉండ డు. తన జీవితాన్ని వీలైనంత సౌకర్యవంతముగా మార్చుకొనుటలో తలమునకలై పోవును. అత్యాశతో అనేకమైనవి కూడబెట్టి అవి శాశ్వతమని ఎప్పటికీ కోల్పోనివని భావిస్తూ ఉంటాడు. వేరే వరి పట్ల ద్వేషముతో తన స్వార్థము కొరకు ఎటువంటి దుర్మార్గాన్నైనా చేయటానికి వెనుకాడడు. మంచి చెడు అను విచక్షణ లేకుండా ధనార్జన చేసాడు తాను సఫలమైతే ఎంతో ఆనందాన్ని, విఫలమైతే ఎంతో దు:ఖాన్ని అనుభవిస్తాడు. అటువంటి వ్యక్తి రజో గుణములో ఉన్నట్లు లెక్క.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement