Friday, April 19, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 8
8.
దు:ఖమిత్యేవ యత్కర్మ
కాయక్తేశభయాత్‌ త్యజేత్‌ |
స కృత్వా రాజసం త్యాగం
నైవ త్యాగఫలం లభేత్‌ ||

తాత్పర్యము : దు:ఖకరములని గాని, దేహమునకు అసౌఖ్యకరములని గాని భావించి విద్యుక్తధర్మములను విడుచువాడు రజోగుణమునందు త్యాగమొనర్చినవాడగును. అట్టి

కార్యమెన్నడును త్యాగమందలి ఉన్నత స్థితిని కలుగుజేయలేదు.

భాష్యము : కృష్ణ భక్తి భావన యందున్నవాడు తాను కామ్యకర్మలను చేయుచున్నాననెడి భయముతో ధన సంపాదనను విడువరాదు. పనిచేయుట ద్వారా మనుజుడు తన ధనమును కృష్ణభక్తికై వినియోగింపగలిగినచో లేదా బ్రహ్మ ముహూర్తమునందే మేల్కొనుటచే తన దివ్యమగు కృష్ణభక్తి భావనను పురోగతి పొందగలిగినచో అతడు భయముతో గాని, ఆ కర్మలు క్లేశకరమని భావించిగాని వానిని మానరాదు. అట్టి త్యాగము తప్పక రజోగుణప్రధానమైనదే. రజోగుణ కర్మ ఫలము సదా దు:ఖపూర్ణముగనే ఉం డును. అట్టి భావనలో మనుజుడు కర్మను త్యాగమొనర్చినచో త్యాగఫలమును ఎన్నడును పొందలేడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement