Friday, March 29, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 6
6.
ఏతాన్యపి తు కర్మాణి
సంగం త్యక్త్వా ఫలాని చ |
కర్తవ్యానీతి మే పార్థ
నిశ్చితం మతముత్తమమ్‌ ||

తాత్పర్యము : ఓ పార్థా! ఈ కర్మలన్నింటిని సంగత్వముగాని, ఎట్టి ఫలాపేక్షగాని లేకుండా స్వధర్మమనెడి భావనలో ఒనరింపవలెను. ఇదియే నా తుది అభిప్రాయము.

భాష్యము : యజ్ఞ విధానములు పవిత్రమొనర్చునవే అయినను మనుజుడు వాని ద్వారా ఎట్టి ఫలమును ఆశింపరాదు. అనగా భౌతికాభివృద్ధికి కారణమగు యజ్ఞములను ఆపవలనే గాని, తన జీవనమును పవిత్రమొనర్చి ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరించు యజ్ఞములను మనుజుడు నిలిపివేయరాదు. శ్రీకృష్ణ భగవానుని భక్తికి కారణమయ్యెడి ఎట్టి కర్మనైనను అంగీకరింపవలెనని శ్రీమద్భాగవతము నందు తెలుపబడినది. ధర్మమునకు అత్యున్నత ప్రమాణమిదియే. కనుక భక్తుడైన వాడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవ యందు తనకు సహాయపడు ఎట్టి కర్మమునైనను, యజ్ఞమునైనను, దానమునైనను తప్పక స్వీకరింపవలెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement