Saturday, April 20, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 4
4.
నిశ్చయం శృణు మే తత్ర
త్యాగే భరతసత్తమ |
త్యాగో హి పురుషవ్యఘ్ర
త్రివిధ : సంప్రకీర్తిత: ||

తాత్పర్యము : ఓ భరతశ్రేష్ఠా! పురుషవ్యాఘ్రా! త్యాగమును గూర్చిన నా నిర్ణయమును ఇప్పుడు ఆలకింపుము. శాస్త్రములందు అట్టి త్యాగము మూడు విధములని తెలుపబడినది.

భాష్యము : త్యాగమును గూర్చి పలు అభిప్రాయములున్నను శ్రీ కృష్ణభగవానుడిచ్చట దాని యెడ తన నిర్ణయమును తెలియజేయుచున్నాడు. దానినే తుది నిర్ణయముగా భావింపవలెను. సత్యమెరిగినచో వేదములనునవి భగవానుడు ఒసగిన వివిధ నియమములే. అట్టి భగవానుడే ప్రత్యక్షముగా నిలిచియుండి పలుకుచున్నందున అతని వాక్యమును తుది నిర్ణయముగా స్వీకరింప వలెను. ఏ గుణమునందు నిర్వహింపబడిన దనెడి విషయముననుసరించి త్యాగము గుర్తింపవలెనని శ్రీ కృష్ణ భగవానుడు పలుకుచున్నాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement