Thursday, April 25, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 17, శ్లోకములు 26,27
26.
సద్భావే సాధుభావే చ
సదిత్యేతత్ప్రయుజ్యతే |
ప్రశస్తే కర్మణి తథా
సచ్ఛబ్ద: పార్థ యుజ్యతే ||

27.
యజ్ఞే తపసి దానే చ
స్థితి: సదితి చోచ్యతే |
కర్మ చైవ తదర్థీయం
సదిత్యేవాభిధీయతే ||

తాత్పర్యము : భక్తియుత సేవా యజ్ఞమునకు పరమలక్ష్యమైన పరతత్త్వము ”సత్‌” అను పదముచే సూచింపబడును. ఓ పృథుకుమారా! దివ్యములై యుండి పరమపురుషుని ప్రీత్యర్థమై ఒనరింపబడు సర్వ యజ్ఞ తపో, దాన కర్మల వలె అట్టి యజ్ఞ కర్త కూడా ”సత్‌” అనబడును.

భాష్యము : ఇక్కడ ”ప్రశస్తే కర్మణి” అనగా జీవుడు పుట్టక ముందు నుండీ మరణించేవరకు పవిత్రీకరణ కోసము అనేక సంస్కారములను చేయవలెనని వేదములు తెలియజేయుచున్నవి. అవి చేసేటపుడు ”ఓం తత్‌ సత్‌’ అను పదములను వాడవచ్చును. సాధువుల సాంగత్యములో మాత్రమే ఇటువంటి దివ్యజ్ఞానమును పొందగలుగుతారు. ఈ విధముగా యజ్ఞములందు, ఉపనయనము నందు భగవంతుణ్ని సూచించే ”ఓం తత్‌ సత్‌” ఉచ్చరించవలెను. అలాగే ”తద్‌ అర్థీయం” అను పదము భగవంతునికి సంబంధించిన సేవలను సూచించున్నది. అనగా భగవంతుని కొరకు వండడము, ఆలయములో సేవలు చేయటము, ఇటువంగటివి భగవంతున్ని కీర్తించుటకు చేయు కార్యములు. ఉత్తమమైన ఈ ”ఓం తత్‌ సత్‌” అను పదములు అన్ని కార్యములను పరిపూర్ణము, దివ్యము చేయును

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement