Thursday, April 25, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 17, శ్లోకం 21
21.
యత్తు ప్రత్యుపకారార్థం
ఫలముద్దిశ్య వా పున: |
దీయతే చ పరిక్లిష్టం
తద్దానం రాజసం స్మృతమ్‌ ||

తాత్పర్యము : ప్రతిఫలవాంఛతో గాని, సకామఫలవాంఛతో గాని, అయిష్టతతో గాని ఒనరింపబడు దానము రజోగుణమును కూడినట్టిదని చెప్పబడును.

భాష్యము : కొన్ని సార్లు ఉన్నత ప్రయోజనము కొరకు, స్వర్గమునకు వెళ్ళుట కొరకు దనాము చేయబడును. అలాగే వేరే వారి ప్రోద్బలముతో గాని, మొహమాటముతో గాని తప్పదని దానము చేయబడును. మరికొన్ని సార్లు ”అయ్యెయ్యో అనవసరముగా దానము చేశానే” అని తరువాత పశ్చాత్తాప పడుదురు. ఇటువంటి దానములన్నీ రజోగుణము క్రిందకే వస్తాయి.

అలాగే కొన్ని చారిటబుల్‌ ట్రష్టులు కూడా వేర్వేరు సంస్థలకు దానము చేయును. కానీ అది ఇంద్రియ తృప్తికే ఉపయోగింపబడును. అటువంటి వానములు శాస్త్ర సమ్మతాలు కావు. కేవలము సత్వగుణములో దానము చేయుటయే అనుమతింపబడుచున్నది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement