Friday, April 19, 2024

గంటన్నరలోనే 2.39 లక్షల టోకెన్ల బుకింగ్‌

తిరుమల, ప్రభన్యూస్‌: మొదటిసారి క్లౌడ్‌ సామాజిక పరిజ్ఞానాన్ని వినియోగించి టీటీడీ విడు దల చేసిన అక్టోబర్‌ నెల కోటా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌కు భక్తుల నుంచి విశేష స్పందన లభిం చిందని, ఒకటిన్నర గంటల వ్యవధిలోనే 2.39 లక్షల టికెట్లను భక్తులు బుక్‌ చేసుకున్నారని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుమల అన్నమ య్య భవనంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌ లో ఎదురైన సాంకేతిక సమస్యలను టీటీడీ ఐటీ విభాగం, టీసీఎస్‌ , జియో సంస్థల నిపుణులు అధి గమించిన విధానాన్ని కూ లంకశంగా తెలియచేశా రు. కోవిడ్‌ సమయంలో పరిమిత సంఖ్యలో విడుదల చేస్తున్న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌కు భక్తుల నుంచి తీవ్ర మైన డిమాండ్‌ ఎదురైందన్నారు. గతంలో కంట్రోల్‌ ఎస్‌, ఏపిీటీఎస్‌ సంస్థల ద్వారా ఫిజికల్‌ సర్వర్ల సాయం తో దర్శన టికెట్ల జారీ జరిగేదని, అయితే అప్పట్లో సమ యం ఎక్కువగా ఉండడంతో భక్తులు త్వరపడకుండా టికెట్లను బుక్‌చేసుకునే వారని వివరించారు. ఆ తర్వా త కాలంలో పరిమితంగా జారీ చేసిన దర్శన టికెట్ల కోసం ఎక్కువ మంది భక్తులు ఒకేసారి దర్శన టికెట్ల కోసం ప్రయత్నించడం మొదలౖౖెందన్నారు. దీనివల్ల ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో సాంకేతిక సమస్యలు ఎదురైనట్లు చెప్పారు. వీటిని టిటిడి ఐటి విభాగం, టిసీఎస్‌ సంస్థల సహకారంతో పరిష్కరించామన్నా రు. అయితే ఇలాంటి సాంకేతిక సమస్యలు పునరావృ తం కాకుండా పలు మార్గాలను అన్వేషించామని, ఇందులో భాగంగా క్లౌడ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టంను విని యోగించుకునేందుకు అమెెజాన్‌, జియో, బుక్‌మై షో, అబిబస్‌ లాంటి సంస్థలను సంప్రదించామని వివ రించారు. వీరిలో జియో సంస్థ ఉచితంగా క్లౌడ్‌ సేవల ను అందించేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శన టికెట్లను బుక్‌ చేసుకునేందుకు జియో సంస్థ 30 మంది ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణులను ఎం పిక చేసిందని, వీరు 22 రోజుల పాటు 24/ 7 శ్రమించి జియో క్లౌడ్‌ ఫ్లాట్‌ ఫాంలో టికెట్లు విడుదల చేశార ని చెప్పారు. అయితే తిరుపతి బాలాజి. ఏపి.జివోవి. ఇన్‌ వెబ్‌ సైట్‌లో సమయాభావం వల్ల జియో మార్ట్‌ సబ్‌ డొమైన్‌ వినియోగిం చాల్సి వచ్చిందన్నారు. వచ్చే నెలలో పూర్తిగా టీటీడీ డొమైన్‌లోనే దర్శన టికెట్లు విడుదల చేస్తామని చెప్పారు. దర్శన టికెట్ల కోసం ఒకే సమయంలో 5.5 లక్షల మంది ఆన్‌లైన్‌లో ప్రయత్నించారని, మొత్తంగా టీటీడీ వెబ్‌సైట్‌కు ఒక కోటికి పైగా హిట్స్‌ వచ్చాయని తెలియ జేశారు. శనివారం ఉదయం 9 గంటలకు రోజుకు 8 వేల చొప్పున సర్వదర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో విడు దల చేస్తామని వెల్లడించారు. ఇందులో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా టిటిడి ఐటి విభా గం, జి యో నిపుణులు, టిసిఎస్‌ నిపుణులతో ఈ రోజు వర్చువల్‌ సమావేశం నిర్వహించామన్నారు.
దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు
వాస్తవాలు తెలుసుకోకుం డా టీటీడీ దర్శన టికెట్ల బుకింగ్‌ వ్యవస్థను జియో సంస్థకు అప్పగించిం దని కొన్ని చానెళ్లు సామాజిక మాథ్య మాల్లో దుష్పచారం చేశారని, ఇలాంటి వార్తల ను నమ్మవద్దని అదనపు ఈవో భక్తుల కు విజ్ఞప్తి చేశారు. దుష్పచారం చేసిన వారి పై చట్టపరంగా చర్యలు తీసు కుంటామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement