Thursday, March 28, 2024

ఖైరతాబాద్ గణేషుడికి ప్రత్యేక పూజలు

రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి పండగ శోభ మొదలైంది. శుక్ర‌వారం నుంచి 9 రోజుల పాటు గణనాథుడు పూజలందుకోనున్నారు. అటు ఖైరతాబాద్ గణేషుడు ప్ర‌త్యేక పూజ‌లు అందుకుంటున్నాడు. స్వామివారికి 60 అడుగుల గరికమాల, జంద్యం, కండువా సమర్పించారు పద్మశాలీలు. ఖైరతాబాద్ గణనాథుడికి తొలిపూజ జరిగింది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై… హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పూజలో పాల్గొన్నారు. స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం నాలుగు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. 30 సీసీ కెమెరాలతో పాటు… 150 మంది ప్రైవేట్ వలంటీర్లను ఏర్పాటు చేసింది ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ.

రాష్ట్రంలో వినాయక చవితి సందడి అంతా ఖైరతాబాద్ గణేషుడి చుట్టూనే తిరుగుతుంటుంది. ఎత్తయిన విగ్రహం కావటంతో అందరి చూపు ఖైరతాబాద్ వినాయకుడిపైనే ఉంటుంది. దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా ఎక్కువే. ప్రతి ఏటా ఒక్కో రూపంలో వినాయక విగ్రహాన్ని తయారు చేస్తుంటారు. ఈ ఏడాది 40 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసింది ఉత్సవ కమిటీ. గతేడాది కరోనాతో కేవలం 9 అడుగుల ప్రతిమను పెట్టారు. ఈ ఏడు ఖైరతాబాద్ లంబోదరుడు పంచముఖ రుద్ర మహాగణపతిగా ఐదు తలలతో దర్శనం ఇస్తున్నారు. ఎడమవైపు కాలనాగ దేవత, కుడివైపు కృష్ణ కాళీ విగ్రహాలు 15 అడుగులతో ఏర్పాటు చేశారు. ఈ నెల 19న గణేశ్ నిమజ్జనం జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement