Friday, March 29, 2024

కోవిడ్‌ నేపథ్యంలో క్యాన్సర్‌ రోగులూ తస్మాత్‌ జాగ్రత్త!

క రోనా వైరస్‌ ప్రస్తుతం ప్రపంచాన్ని ముఖ్యంగా భారత్‌ను బెంబేలెత్తిస్తోంది. ఈ సమయంలో క్యాన్సర్‌ రోగులకు మరింత ప్రమాదం పొంచి ఉంది. క్యాన్సర్‌ రోగులలో అసలే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందువల్ల వారు కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువ. అయితే ఈ ప్రమా దం ఏ మేరకు ఉంటుందన్నది ఆయా రోగుల వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. క్యాన్సర్‌ రోగుల గత చరిత్ర, వారికి ఉన్నది ఏ క్యాన్సర్‌, వారు ఆ క్యాన్సర్‌కు ఎటువంటి చికిత్స తీసుకుంటున్నారు వంటివి అన్నీ పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. ఈ విషయంలో స్పష్టమైన లెక్కలు లేకపోయినా ఇతరులతో పోలిస్తే కరోనా సోకిన క్యాన్సర్‌ రోగులలో మరణాలు ఎక్కువగా ఉన్నట్టు ఒకటి రెండు చిన్న అధ్యయనాల్లో వెల్లడయింది. అందునా క్యాన్సర్‌ చికిత్స తీసుకున్న వారికన్న తీసుకుంటున్న వారిపైనే ప్రభావం ఎక్కువగా ఉంటున్నదని వెల్లడయింది. క్యాన్సర్‌ రోగులలో కూడా సాధారణ ట్యూమర్ల కన్న లుకేమియా, లింఫోమా వంటి వాటికి చికిత్స పొందుతున్నవారికి కరోనా వల్ల ఎక్కువ ప్రమాదముంటుందని తేలింది. దీనికి కారణం లుకేమియా వంటి వాటికి చికిత్స తీసుకునే రోగుల్లో వైరస్‌కు వ్యతిరేకంగా యాం టీబాడీస్‌ను ఉత్పత్తి చేసే కణాలు దెబ్బతినడమే. రరీమో థెరపీ మొదలైన వారం రోజుల తర్వాత రోగి వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లి ఏడెనిమిది రోజులుల అదే స్థితిలో ఉంటుంది. ఆ తర్వాత పుంజుకుని మూడు వారాల్లో పూర్వపు స్తితికి చేరుకుంటుంది. అయితే కీమో థెరపీ తీసుకునే సమయంలో కూడా రోగుల రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఇమ్యూన్‌ బూస్టర్‌ షాట్స్‌ వంటివి ఉన్నాయి. వీటి వల్ల రోగ నిరోధక వ్యవ స్థ నిద్రాణంగా ఉండే కాలాన్ని ఏడెనిమిది రోజుల నుంచి మూడు నాలుగు రోజులకు తగ్గించవచ్చు. ఇవి కాకా క్యాన్సర్‌ రోగులు సోషల్‌ డిస్టెన్సింగ్‌ వంటివి చాలా ముఖ్యమని గుర్తించాలి. అయితే క్యాన్సర్‌ కారణంగా బోన్‌ మారో ట్రాన్స్‌ ప్లాంట్‌ జరిగి సంవత్సరం దాటిన వారు మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత కరోనా సమయంలో కూడా క్యాన్సర్‌ చికిత్స కొనసాగాలి. ఎందుకంటే క్యాన్సర్‌ అనేది మనం ఉపేక్షించడానికి వీలు లేని పెద్ద వ్యాధి.
గ్రామాలలో ఉండి క్యాన్సర్‌ చికిత్సకు వెళ్ళి వచ్చేవారు మరింత సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. ఇటువంటి సమయంలో వైద్యవ్యవస్థలోని అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి గ్రామాల్లో ఉం సమస్యలు ఎదుర్కొంటున్న వారికి తగినంత సహాయ సహకారాలు అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. క్యాన్సర్‌ నిపుణులు రోగులు విషయాన్ని వ్యక్తిగతంగా ఒక్కొక్కరి పరిస్థిితిని పరిగణన లోకి తీసుకుని ప్రతికూలతల మధ్య ఉన్న అనుకూలతలను అన్వేషించి తరుణోపాయాలు అలోచించాలి. క్యాన్సర్‌ రోగులకు వ్యాక్సినేషన్‌ విషయంలో పలు అనుమానా లున్నాయి. అయితే వారికి వ్యాక్సినేషన్‌ ఏ మేరకు క్షేమకరం అన్నదాని విషయంలో ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది. అయితే రోగ నిరోధక శక్త సన్నగిల్లిన వారు వ్యాక్సిన్‌కు స్పందించే అవకాశాలు తక్కువని కొందరు వైద్య నిపుణులు అభిప్రాయపడుతన్నారు. ఇక్కడ కూడా రోగులు పరిస్థితిని బట్టే వ్యాక్సినేషన్‌ తీసుకోవాలా? వద్దా? అన్న దానిపై నిర్ణయం తీసుకోవాలి. డాక్టర్లను సం ప్రతిస్తే వారే అవసరమో కాదో చెప్పగలరు. అయితే వ్యాక్సిన్‌ వేసుకోవడం వల్ల ఎంతో కొంత రక్షణ ఉంటుందని, అసలు లేకపోవడం కంటె ఎంతో కొంత రక్షణ మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
– డా. నాగేంద్ర పర్వతనేని
సీనియర్‌ కన్సల్టెంట్‌, హెడ్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సర్జికల్‌ ఆంకాలజీ
కిమ్స్‌ హాస్పిటల్‌, హైదరాబాద్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement