Thursday, April 25, 2024

ఓజస్సు, తేజస్సు పెంచే మృగశిర కార్తె

”తొలకరి జల్లుల అనంతరం ధరణి నుంచి ఉద్భ వించి వ్యాపించే పరిమళాన్ని తానేన”ని వివరి స్తాడు శ్రీకృష్ణుడు.
ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి, మానవునిలో ఓజస్సు, తేజస్సు మృగశిర కార్తె అనంత రం అధికం అవుతాయని జీవకుడనే ప్రాచీన వైద్యుడు, తన గ్రంథాల్లో వివరించాడు.
ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ రోజున ఆధ్యాత్మిక చింతనతో గడపాలని శాస్త్రాలు చెపుతున్నాయి.
భారతీయ జ్యోతిష సాంప్రదాయ ప్రకారం ఒక్కో కార్తెలో దానికి సంబంధించి ప్రకృతిలోని మార్పు, దాని వలన జరిగే ప్రత్యేకాంశాలను సవివరంగా వివరించింది. ఈ కార్తెల ఆధారంగావ్యవసాయదారులు, గ్రామీణ ప్రాం తం వారు తమతమ వృత్తివ్యాపకాలను కొనసాగిస్తుం టారు. ప్రధానంగా కార్తెలపై ఆధారపడి చేసే వృత్తి వ్యవ సాయం. రైతులు కార్తెల ఆధారంగా వారి పంట లను నిర్ణయించుకుని సాగు చేసుకుంటారు. సూర్యుడు మృగశిర నక్షత్రంలో ప్రవేశించిన నాటి నుండి మృగశిర కార్తె ఏర్పడుతుంది. ఈ కార్తె నుండి వర్షాలు పడతాయని అన్నదాతల భావన. ఇదే సమయంలో మన ప్రాంతం లోకి నైఋతి ఋతు పవనాలు ప్రవేశిస్తాయి.
పంచాంగ ప్రకారం ఆరుద్ర నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సమయంలోని తిథి, వార, నక్షత్ర యోగ కర ణాలు, శకునాలు తదితర అంశాల ఆధారంగా చేసుకుని ఆ సంవత్సరంలో కురిసే వర్షాన్ని నిర్ణయిస్తారు. ఈ విధంగా వ్యవసాయదారులకు నిత్య జీవనోపయోగిగా వ్యవసాయ పనులకు మార్గదర్శకంగా ఈ కార్తెలు ఉప యోగపడుతున్నాయి.
పురాణ గాథ ప్రకారం మృగ శిరస్సు కలిగిన మృగ వ్యాధుడు అను వృతాసురుడు వర ప్రభావంచే పశువు లను, పంటలను #హరించి వేయడం, ప్రకృతి భీభత్సాల ను సృష్టించడం, వర్షాలకు అడ్డుపడటం జరుగుతూ ఉం డేది. ఆయన ఎటువంటి ఆయుధాలతోనూ తనకు మర ణం సంభవించకుండా అనేక వరాలు కలిగి ఉన్నాడు. అందుచేత, ఇంద్రుడు సముద్ర అలల నుండి వచ్చే నురు గును ఆయుధంగా చేసి మృగవ్యాధుడిని చంపాడు.
ఖగోళంలో ఇంద్ర నక్షత్రమైన జ్యేష్టకు, మృగశిరకు 180 డిగ్రీల దూరంలో ఉండటం వలన, తూర్పు ఆకా శంలో ఇంద్ర నక్షత్రం ఉదయించగానే, వృతాసుర నక్ష త్రం అస్తమిస్తుంటుంది.
భారతదేశంలో మృగశిర కార్తెకు విశేష ప్రాధాన్యత ఉంది. రో#హణి కార్తెలో రోళ్ళు పగిలే ఎండలతో సతమత మయ్యే జీవకోటికి, ఈ కార్తెలో వచ్చే నైరుతి రుతు పవ నాలతో వాతావరణం చల్లబడి, ఉపశమనం కలుగు తుంది. ఈ కార్తెను రైతులు ఏరువాక సాగే కాలం అని కూడా అంటారు. ఏరువాక అంటే నాగటి చాలు. ఈ కాలంలో తొలకరి జల్లులు పడగానే, పొలాలు దున్ని పంటలు వేయడం మొదలు పెడతారు.
చంద్రుడు ఒక్కొక్క నక్షత్రం సమీపంలో 14 రోజుల పాటు ఉంటాడు. ఏ నక్షత్రం సమీపంలో ఉంటే.. ఆ కార్తె కు ఆ పేరు వాడతారు.
సౌరమానం ప్రకారం గణించడంతో ఈ కార్తెలు గ్రెగే రియన్‌ క్యాలెండరు ప్రకారం ఏటా ఒకే తేదీల్లో వస్తాయి. అశ్వినితో ప్రారంభమై రేవతితో ముగిసే ఇరవై ఏడు నక్ష త్రాల పేర్లతో కార్తెలు ఉన్నాయి. అవి 1. అశ్వని, 2. భరణి, 3. కృత్తిక, 4. రో#హణి 5. మృగశిర 6. ఆరుద్ర 7. పునర్వసు 8. పుష్యమి 9. ఆశ్లేష 10. మఖ 11. పుబ్బ 12. ఉత్తర 13.#హస్త 14. చిత్త 15. స్వాతి 16. విశాఖ 17. అనూరాధ 18. జ్యేష్ఠ 19. మూల 20. పూర్వాషాడ 21. ఉత్తరాషాడ 22. శ్రవణం 23. ధనిష్ట 24. శతభిషం 25. పుర్వాబాధ్ర 26. ఉత్తరాబాధ్ర 27. రేవతి.
అశ్వినితో ప్రారంభమై రేవతీతో ముగిసే వరకు మొత్తం ఇరవై ఏడు నక్షత్రాల పేర్లతో కార్తెలు ఉన్నాయి. ప్రస్తుతం మృగశిర నక్షత్రానికి చేరువలో చంద్రుడు ఉండటం వల్ల దీనికి ”మృగశిర కార్తె” అనే పేరు వచ్చింది. వైశంపా యనుడు మృగశిర కార్తె రోజునే తన శిష్యుడైన యాజ్ఞవ ల్యునికి తైత్తిరీయోపనిషత్తును బోధిం చాడని అంటారు. ఈ ఉపనిషత్తు వర్షాధిపతి అయిన వరుణ దేవుని ప్రార్ధన తోనే ప్రారంభం అవుతుంది. ఈ కార్తె ప్రాధాన్యత మన కు భగవద్గీతలోనూ కనిపిస్తుంది.
మృగశిర కార్తె మొదటి రోజును దేశవ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తారు. మృగశిర, మృగం, మిరుగు మిర్గం పేర్లతో వ్యవ#హరిస్తారు. ఈ రోజున ప్రజలు బెల్లంలో ఇంగువను కలుపుకుని సేవిస్తారు. ఇం గువ శరీరంలో ఉష్ణాన్ని ప్రేరేపించి.. వర్షాకాలంలో సోకే వ్యాధులను నియంత్రిస్తుందని పెద్దలు చెబుతారు. అలాగే మృగశిరకార్తె ప్రారంభం రోజున చేపలు/ ఇతర మాంసా హారం తింటే వ్యాధులు దరిచేర వని ప్రజల విశ్వాసం.
మృగశిరకార్తె కాలంలో పడే వర్షపు నీటిని వృధా పోని వ్వకుండా సద్వినియోగపరుచుకునే మార్గాలను అన్వేషిం చాలి. ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టుకుని, ఇంకు డు గుంతల నిర్మాణం చేసి, భవిష్యత్తులో అవి భూమిలో నీటి నిల్వలను పెంచి చెరువులు, బావులు, బోర్లు ఎండి పోకుండా ఉపయోగ పడేలా చూసుకోవాలి. అలాగే భూ వసతి ఉన్న చోటల్లా, ఎక్కువ మోతాదులో మొక్కలు నాటాలి. స్థలంలేని వాళ్ళు మనం నివసించే పరిసర ప్రాంతాలలో, మన ఊరి రోడ్డునకు ఇరువైపులా, శక్తి వంచన లేకుండా చెట్లను నాటితే, అవి మనకు మేలు చేస్తాయి. భవిష్యత్తులో అవే కాపాడుతాయి. సమాజానికి ఉపయోగపడే పనులకు సమిష్టిగా పనిచేయ సంకల్పిం చడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. అదే భవిష్యతు ్తకు భరోసా.
– రామ కిష్టయ్య సంగనభట్ల
9440595494

Advertisement

తాజా వార్తలు

Advertisement