Friday, March 29, 2024

ఇతరులను నడిపించడము (ఆడియోతో…)

నీలో గుప్తంగా ఉన్న శుద్ధమైన భావాలు, విశ్వాసము, నమ్మకము వంటి కళలు ఆధారంగా మంచి నాయకత్వము ఉంటుంది. ఇవి నీ మనసును, నువ్వు చేసే పనిని సక్రమ మార్గంలో ఉంచుతాయి. తప్పులు చేయడం మానవ సహజం, కానీ నీకు ఎదుటివారిపై ఉన్న అమితమైన విశ్వాసము వారిని తప్పులు చెయ్యనివ్వదు. వ్యక్తులను అనుమానించడం వలన ఇందుకు విరుద్ధమైన ప్రభావం ఉంటుంది. ఒకరిని నమ్మడం, వారికి నీలోని నమ్మకాన్ని అందించడం, ఏమి చెయ్యాలి అని చెప్పడం కన్నా వారిపై విశ్వాసంతో వారిని గమనిస్తూ ఉండటం వలన పని సక్రమంగా జరుగుతుంది. ఇటువంటి ఆధ్యాత్మిక నైపుణ్యాలను ఆత్మ వంచన లేకుండా, సూక్ష్మ బుద్ధి కలిగి ఉండి, జాగరూకతతో వ్యవహరించడం ద్వారా పెంపొందించుకోవచ్చు. నీ ఆధ్యాత్మిక ఆరోగ్యంపై ఒక కన్ను వేసి ఉంచు. ఇతరులలో ఏ లోపాలు ఉన్నాయి అని చూడకు, నిన్ను నువ్వు చూసుకో. నువ్వు చెయ్యవలసిందేమిటో చూసుకుని దానిని చెయ్యి. ఏది సరైనదో నీకు తెలిసినప్పుడు మరొకరు నీకు చెప్పే స్థితిని తెచ్చుకోవద్దు, ఎందుకంటే దీని వలన నువ్వు మనస్థాపానికి గురి అవుతావు. చక్కని అవగాహనతో, ప్రేమతో నిన్ను జాగ్రత్తగా చూసుకో. నీ ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఎటువంటి రాజీకి రావద్దు.

-బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement