Tuesday, April 23, 2024

ఆదిత్యుడిని తాకిన సూర్యకిరణాలు

తిలకించి పరవశించిన భక్తులు
శ్రీకాకుళం, ప్రభ న్యూస్‌: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవెల్లిలో శుక్రవారం ఉదయం భక్తులు ఆనందపరవశులయ్యారు. సూర్యోదయం సమయంలో లేలేత భానుడి కిరణాలు అరసవెల్లి శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయంలో మూలవిరాట్టుని తాకుతూ స్వామివారి విగ్రహాన్ని పసిడిఛాయతో శోబిల్లింపజేసా యి. ప్రతీ ఏటా మార్చి 9,10,11 తేదీల్లో, అక్టోబర్‌ 1,2,3 తేదీల్లో సూర్యదోయ సమయంలో భానుడి తొలి కిరణాలు సూర్యభగవానుని తాకుతూ భక్తులను పరవసింపజేస్తాయి. ఈ దృశ్యాన్ని చూసేందుకు జిల్లా నలుమూలల నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి భక్తులు ఈ రెండు మాసాల్లో పేర్కొన్న తేదీల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. కొన్ని సందర్భాల్లో ఆకాశంలో మబ్బులు కారణంగా ఇటువంటి దృశ్యాలు కనిపించకుండా పోతాయి. అటువంటుపప్పుడు ఆలయానికి వచ్చే భక్తులు ఆసంతృప్తితో వెళ్లిపోతుంటారు. ఈ సంవత్సరం మార్చి నెలలో కూడా ఆకాశంలో మబ్బులు కారణంగా భక్తులు ఈ దృశ్యాన్ని చూడలేక పోయారు. శుక్రవారం ఉదయం 6.04 సమయంలో ఆకాశంలో నుండి సూర్యుని తొలికిరాణాలు ఆలయ అనివెట్టి మండ పంమీదుగా గర్భాలయంలో ఉన్న స్వామివారి విగ్రహాన్ని పాదాల నుండి శిరస్సు వరకూ సృసిస్తూ స్వామివారి విగ్రహాన్ని బంగరం కాంతిలో తేజోవంతం చేసాయి. ఈ దృశ్యాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చిన భక్తులు ఆనందపరవసులయ్యారు. దాదాపు ఆరు నిమిషాలపాటు ఈ విధంగా భాణుడి తొలికారణాలు స్వామివారి మూల విరాట్టుని తాకుతూ రావడానని తిలకించిన భక్తులు పరవసించిపోయారు. ఇటువంటి అద్భుత దృశ్యం చూడడం తమ పూర్వజన్మ సుకృతమని ఆలయానికి వచ్చిన పలువురు భక్తులు ఎంతో ఆనందంతో తెలియజేసారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈఒ హరిసూర్యప్రకాష్‌, సూపరింటెండెంట్‌ చక్రవర్తి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement