Tuesday, April 23, 2024

అవకాశం లేదు అలసట వస్తుంది ‘అనేసాకు’

సాధారణంగా ఎనిమిది గంటలు ఈశ్వరీయ యోగంలో ఉండలేకపోయే కారణం ఆఫీసు పనులలో బుద్ధి బాగా మునిగి వుంటుందనే ఒక సాకు చెబుతుంటారు. ఆఫీసు నుండి తిరిగి వచ్చిన తరువాత ఇపుడు రోజంతా కార్యభారాల వలన బుద్ధి అలసిపోయింది కావున కొంచెం విశ్రాంతి కావాలి. లేకపోతే ఏదో కొంచెం వినోదంగా గడపాలి అనుకొంటారు. ఈవిధంగా తనకు తాను పొరబాటుగా అర్థం చేసుకొన్న వారు ఈశ్వరీయ స్మతి వైపు తక్కువ ధ్యాస పెట్టి తమ చార్టులో స్మృతి వేగమును పెంచుకోలేరు. వారు మనం వృధాగా నన్ను నేను సంతోషపెట్టుకుంటున్నాను. ఈసాకు చెప్పి జన్మ జన్మాంతరాల వరకు నన్ను నేనే నష్ట పరచుకొంటున్నాను. నా భాగ్యం కోల్పోయేట్లు చేసికొంటున్నాను”. అని ఆలోచించరు. ఎనిమది గంటలు పనిలో ఉన్నపుడు టెలిఫోన్‌ రింగ్‌ అయితే లేక ఎవరన్నా కలుసుకొనుటకు వస్తే టీ, టిఫిన్‌, కాఫీ చేయాలనిపిస్తే అటువైపు మాత్రం ధ్యాస పెడతారు. రోజంతా బుద్ధి పనుల్లోనే నిమగ్నమై ఉండదు. రోజంతా అతని ఎదురుగా గిరాకి, ఆఫీస్‌ ఉండదు గంటకు 5,7 నిమిషాలు కూడా అవకాశం లేకుండ వుంటుందా? కావుననే శివబాబా కార్యవ్యవహారాలు చేసేటపుడు కూడా ఏమైనా కానీ, ఏవిధంగానైనా సరే ప్రతి గంటకు 5,7 నిమిషాలు ”ఆత్మిక స్వరూపంలో ఉప స్థితులై ఈశ్వరీయ స్మృతికార్యం తప్పకుండా చేయవలసిందే” అని ధ్యాస పెట్టుకొనండి అంటారు. ఒక వేళ మనకు ఆఫీసులో ఏదో ఒక రోజు చాలా అత్యవసరమైన పనులుంటే, మన దుకాణంలో ఎక్కువ గిరాకీ వస్తే మనం అటువైపు ధ్యాస పెట్టడం లేదా? పిల్లవాడు ఎక్కువైతే వాడిని చూసుకొనడం లేదా? మనడ్యూటి అనుకొని నిర్వర్తిస్తారు కదా? మరి మనం ఈశ్వరీయ స్మృతికి వి లువనివ్వని కారణం ఏమిటి? దీని వలన వేరెవరికైన లాభం కలుగుతుందా? లేక దీని కోసం మనకు ఇంకొక జన్మ లేక మరొక యుగం వస్తుందా? శివబాబా కూడా ఒక గిరాకీ. మన దుకాణానికి వచ్చాడని మనతో కేవలం అయిదు నిమిషాలు ఈశ్వరీయ స్మతియనే వస్తువు అడుగుతున్నాడని, అది ఇస్తే అయిదు కోట్ల రూపాయిలు ఇస్తాడని ఎందుకు భావించరాదు. ప్రతి గంటలో ఒక ఫైలు ఈశ్వరీయ గవర్నమెంటు నుండి వస్తుందని దానిపైన వెంటనే అనే చీటి పెట్టబడివుందని ఫైలులో మనం మన గురించే ఆలోచించుకొనాల్సి ఉంటుందని ఎందుకు ఆలోచించరాదు. ఆఫీస్‌లో కూడా వారం రిపోర్టు లేక మాసకి రిపోర్టు తయారు చేస్తారు గదా! గంటకు ఒకసారి మన గురించి కూడా ఈశ్వరీయ గవర్నమెంట్‌కు రిపోర్ట్‌ యివ్వాలని ఎందుకు భావించ కూడదు? ఈశ్వరీయ స్మృతితో మన నిర్ణయ శక్తి, కార్యశక్తి పెంపొందుతుంది.

మామూలుగా ఒక వ్యక్తి గంటకు చేసే పని ఈశ్వరీయ స్మృతిలో వుంటే దానిని తక్కువ సమయంలో చేయగల్గుతాడు కావున ఈశ్వరీయ స్మృతి మన వ్యవహారాన్ని చక్కపెట్టుటలో కూడా సహాయ పడుతుంది. శివబాబా ఆఫీస్‌లో మీరు కలాన్ని ఉపయోగించేటపుడు నేను కమల సమానంగా అతీతుడను దేనికీ అంటనివాడని” అని కలంతో బాటు కమలాన్ని కూడా జ్ఞాపకం పెట్టుకోండి అని అం టారు. మీ ఎదురుగా ఏదైన ఫైలు వచ్చినప్పుడు ఇపుడు శివబాబా నా జీవితమనే ఫైలు లేక రికార్డ్‌ లో ఏ రిమార్కు ఇస్తుండవచ్చు? ఏ విషయంపై సంతకం చేస్తుండవచ్చు. ఎపుడైన మీరు వ్యాపార కార్యాల గురించి పరిగెత్తాల్సి వస్తే, బుద్ధిని పరిగెత్తించాల్సి వస్తే ”మనం ఈశ్వరీయ స్మృతి యాత్రలో కూడా పరిగెత్తుతామా? లేదా అని ఆలోచించండి. ఈ విధంగా పొరబాట్లను వదిలి సరిచేసికోకపోతే ఈ కలియుగ సృష్టియనే గృహానికి నిప్పు అంటుకోనున్నది. ప్రపంచ పరిస్థితులు మన ఎదురుగానే వున్నాయి. ”ఇపుడు లేకపోతే మరెపుడు చేస్తారు”

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement