Wednesday, April 24, 2024

అయ్యప్పస్వామి దర్శనం ప్రారంభం

తిరువనంతపురం: శబ రిమలలోని అయ్యప్ప దేవాలయం తలు పులు తెరుచుకున్నాయి. శనివారం సాయంత్రం 5
గంటలకు తులా మాసం పూజలు ప్రారంభం అయ్యాయి. ప్రధాన అర్చకులు వీకే జయరాజ్‌ పాటీ గర్భగుడి తలుపు తెరిచారు. నెయ్యభిషేకం, ఉదయస్థాన పూజ, కలాభిషేకం, పడిపూజ, పుష్పాభిషేకం ఆచారాలను కొనసాగిస్తారు. ఆదివారం ఉదయం నుంచి అక్టోబర్‌ 21 రాత్రి వరకు ఆరు రోజులపాటు స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డు తెలిపింది. కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, టీకా తీసు కున్న వారిని, ఆర్టీపీసీఆర్‌ రిపోర్టు ఉన్నవారినే అనుమ తిస్తామని తెలిపింది. ఆదివారం ఉష పూజ ఆచారాల తర్వా త శబరిమల, మాలికాపురం దేవాలయాల తదుపరి ప్రధా న పూజారిని ఎంపిక చేయనున్నారు. వారు ఏడాదిపాటు అర్చకులుగా కొనసాగుతారు. ప్రధాన పూజారి పదవికి ప్రస్తుతం తొమ్మిది మందితో కూడిన జాబితాను సిద్ధంచేశా రు. వీరిలో ఒకరిని ఈ పవిత్రమైన బాధ్యతలకు ఎంపికచే యనున్నారు. మళ్లిd నవంబర్‌ 2న ఆలయం తలుపులు తెరు స్తారు. చితిర అట్టవిశేషం నిర్వహిస్తారు. ఆ మర్నాడు ఆల యాన్ని మూసివేస్తారు. వార్షిక మండలం- మకర విలక్కు పండుగ కోసం నవంబర్‌ 15న తిరిగి తెరవబడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement