Thursday, March 28, 2024

అన్నమయ్య సంకీర్తనలు

రాగం : నాగ గాంధారి
వీడుగదె శేషుడు

వీడుగదె శేషుడు శ్రీ వేంకటాద్రి శేషుడు
వేడుక గరుడనితో బెన్నుద్దై శేషుడు || వీడుగదె శేషుడు ||

వేయి వడిగెలతోడ వెలసిన శేషుడు
చాయమేని తళకువజ్రాల శేషుడు
మాయని శిరసులపై మాణికాల శేషుడు
యే యెడ హరికి నీడై యేగేటి శేషుడు || వీడుగదె శేషుడు ||

పట్టపు వాహనమైన బంగారు శేషుడు
చుట్టు చుట్టుకొనిన మించుల శేషుడు
నట్టుకొన్న రెండువేలు నాలుకల శేషుడు
నెట్టన హరిపొగడ నేరుపరి శేషుడు || వీడుగదె శేషుడు ||

కదిసి పనులకెల్ల కాచుకున్న శేషుడు
మొదల దేవతలెల్లా మొక్కే శేషుడు
అదె శ్రీ వేంకటపతి కలమేలు మంగకును
పదరక యే పొద్దూ పానుపైన శేషుడు || వీడుగదె శేషుడు ||

Advertisement

తాజా వార్తలు

Advertisement