Wednesday, April 24, 2024

అన్నమయ్య సంకీర్తనలు

దేవశిఖామణివి

దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు
యీవల నీ బంట నాకు నెదురింక నేది || ||దేవశిఖామణివి||

కామధేనువు పిదుకగల కోరికె లివెల్ల
కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట
కామించి నీ బంటనట కమ్మినిన్ను దలచితి
ఏమి మాకు గడమయ్య యిందిరారమణా || ||దేవశిఖామణివి||

ఎంచ కల్పవృక్షమును యిచ్చు సిరులెల్లాను
నించి కల్పవృక్షముల నీడల కృష్ణుడవట
అంచెల నీ బంటనట ఆత్మలోనిన్ను నమ్మితి
వంచించ కడమ యేది వసుధాధీశ || ||దేవశిఖామణివి||

తగనొక్క చింతామణి తలచినట్ల జేసు
మిగులకౌస్తుభమణి మించిన కృష్ణుడవట
పగ టు శ్రీవేంకటేశ భక్తుడ నీకట నేను
జగములో కొఱతేది జగదేక విభూడా || ||దేవశిఖామణివి||

Advertisement

తాజా వార్తలు

Advertisement