Thursday, April 25, 2024

అన్నమయ్య సంకీర్తనలు

శ్రీహరి నిత్యశేషగిరీశ

శ్రీహరి నిత్యశేషగిరీశ
మోహనాకార ముకుంద నమో || శ్రీహరి నిత్యశేషగిరీశ ||

దేవకీ సుత దేవ వామన
గోవిందా గోప గోపీనాథా
గోవర్థనధర గోకుల పాలక
దేవేశాధిక తే నమో నమో || శ్రీహరి నిత్యశేషగిరీశ ||

సామజావన శార్జపాణ
వామనా కృష్ణ వాసుదేవా
రామనామ నారాయణ విష్ణో
దామోదర శ్రీధర నమో నమో || శ్రీహరి నిత్యశేషగిరీశ ||

పురుషోత్తమ పుండరీకాక్ష
గరుడధ్వజ కరుణానిధి
చిరంతన అచ్యుత శ్రీ వేంకటేశ్వర
నరమృగ తే నమో నమో || శ్రీహరి నిత్యశేషగిరీశ ||

Advertisement

తాజా వార్తలు

Advertisement