Saturday, April 20, 2024

అన్నమయ్య సంకీర్తనలు

రాగం : మోహన
వేదములు నుతించగ

వేదములు నుతించగ వేడుకలు దేవారగ
ఆదరించీ దాసుల మోహన నారసింహుడు || వేదములు నుతించగ ||

నె ఱుల జడలతోడ నిక్కు కర్ణములతోడ
కుఱచ కొమ్ములతోడ కోఱలతోడ
పుఱక సిరి దొడపైనుంచుక సింహాసనాన
మెఱసీ ప్రతాపములు మేటి నారసింహుడు || వేదములు నుతించగ ||

నిడుపమీసాలతోడ నిట్టూరుపులతోడ
మిడిగుడ్లతో తెల్లనిమేని తోడ
ఒడల సొమ్ములు వెట్టి ఒడ్డోలగమైవుండి
కడుమంచి వరాలిచ్చీ ఘననారసింహుడు || వేదములు నుతించగ ||

చిలుకు గోళ్లతోడ సెలవినవ్వులతోడ
బలు జిహ్వతోడ యోగ పట్టెముతోడ
అలరి శ్రీ వేంకటాద్రి అహోబలగిరిని
అలప్రహ్లాదుని గాచె ఆది నారసింహుడు || వేదములు నుతించగ ||

Advertisement

తాజా వార్తలు

Advertisement