Friday, March 29, 2024

అన్నమయ్య సంకార్తనలు

రాగం – ఆనంద భైరవి
తాళం – ఆదితాళం

ప|| కంటి శుక్రవారము గడియ లేడింట
అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని || కంటి ||

చ|| సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి
కమ్మని కదంబము కప్పు పన్నీరు
చెమ్మతోన వేష్టువలు రొమ్ము తల మొలచుట్టి
తుమ్మెద మైఛాయతోడ నెమ్మది నుండే స్వామిని || కంటి ||

చ|| పచ్చకప్పురమె నూరి పసిడిగిన్నెల నించి
తెచ్చి శిరసాదిగ దిగనలది
అచ్చెరపడి చూడ అందరి కన్నుల కింపై
నిచ్చమల్లెపూవు వలె నిటు తానుండే స్వామిని || కంటి ||

చ|| తట్టుపునుగే కూరిచి చట్టలు చేరిచి నిప్పు
పట్టీ కరగించి వెండి పళ్యాలు నించి
దట్టముగ మేనునిండ పట్టించి దిద్ది
బిట్టు వేడుక మురియుచు నుండే చిత్తరి స్వామిని || కంటి ||

- Advertisement -

భావము : ఈ సంకీర్తనములో వేంకటేశ్వరస్వామికి శుక్రవారము నాడు జరుగు అలంకార క్రమము వర్ణించారు అన్నమయ్య. స్వామి మంగమ్మతో కూడి యున్నాడు. అతనిని తాకి, ఆభరణములతో అలంకరించెదరు. కడిమి వాసనతోడి పన్నీటిని చల్లెదరు. ఆయన వక్షమునకు, తలకు, నడుముకు వస్త్రములు కట్టెదరు. తుమ్మెద వ ంటి రంగుగల స్వామికి.
పచ్చకర్పూరము పొడిని బంగారు గిన్నెలో ఉంచి స్వామి వారి తలనుంచి అంటుదురు. సదా మల్లెపూవు వలె భాసిస్తూ ఉండే స్వామి సకల జనుల కన్నుల కింపుగా ఉన్నారు.
పునుగు అనుగు పరిమళ ద్రవ్యాన్ని నిప్పుతో కరిగించి దాన్ని వెండి పళ్ళాల్లో ఉంచి, స్వామి శరీరము నిండా పట్టించగా స్వామి ఎంతో సంతోషముతో మురియుచుండును.

Advertisement

తాజా వార్తలు

Advertisement