Friday, April 19, 2024

అన్నమయ్య కీర్తనలు : వాడల వాడల వెంట

వాడల వాడల వెంట వసంతము
జాడతో చల్లేరు నీపై జాజర జాజర జాజ || వాడల వాడల వెంట ||

కలికి నవ్వులె నీకు కప్పుర వసంతము
వలచూపు కలువల వసంతము
కులికి మాటాడినదె కుంకుమ వసంతము
చలమున చల్లె నీపై జాజర జాజర జాజ || వాడల వాడల వెంట ||

కామిని జంకెన నీకు కస్తూరివసంతము
వాముల మోహపు నీటి వసంతము
బూమెల సరసముల పుప్పొడి వసంతము
సామజ గురుడ నీపై జాజార జాజర జాజ || వాడల వాడల వెంట ||

అంగన అధరమిచ్చే అమృత వసంతము
సంగడి శ్రీవేంకటేశ సతిగూడితి
ముంగిటి రతి చెమట ముత్తేలవసంతము
సంగతాయెనిద్దరికి జాజర జాజర జాజ || వాడల వాడల వెంట ||

Advertisement

తాజా వార్తలు

Advertisement