Thursday, March 28, 2024

అన్నమయ్య కీర్తనలు : వాడల వాడల వెంట

వాడల వాడల వెంట వాడెవో వాడేవో
నీడ నుంచి చీరలమ్మే నేత బేహారి || వాడల వాడల వెంట ||

పంచ భూతములనెడి పలువన్నె నూలు
చంచలపు గంజివోసి చరిసేసి
కొంచెపు కండెల నూలి గుణముల నేసి
మంచి మంచి చీరలమ్మే మారు బేహారి || వాడల వాడల వెంట ||

మట మాయముల తన మగువ పసిడి నీరు
చిటిపొటి యలుకల జిలికించగా
కుటిలంపు జేతలు కుచ్చులుగా గట్టి
పట వాళి చీరలమ్మే బలు బేహారి || వాడల వాడల వెంట ||

మచ్చిక కర్మ మనేటి మైల సంతలోన
వెచ్చపు కర్మధనము వెలువ చేసి
పచ్చడాలుగా గుట్టి బలు వేంకటపతి
ఇచ్చ కొలదుల నమ్మే ఇంటి బేహారి || వాడల వాడల వెంట ||

Advertisement

తాజా వార్తలు

Advertisement