Wednesday, April 24, 2024

అన్నమయ్య కీర్తనలు : రామచంద్రుడితడు

రాగం : దిజావంతి
రామచంద్రుడితడు రఘువీరుడు
కామిత ఫలము లియ్యగలిగె నిందరికి || ||రామచంద్రుడితడు ||

గౌతము భార్యపాలిటి కామధేను వితడు
ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము
సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు
ఈతడు దాసులపాలి ఇహపర దైవము || ||రామచంద్రుడితడు ||

పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు
సరి హనుమంతు పాలి సామ్రాజ్యము
నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు
గరిమ జనకు పాలి ఘనపారిజాతము || ||రామచంద్రుడితడు ||

తలప శబరి పాలి తత్త్వపు రహస్యము
అలరి గుహుని పాలి ఆదిమూలము
కలడన్న వారి పాలి కన్ను లెదుటి మూరితి
వెలయ శ్రీ వేంకటాద్రి విభుడీతడు || ||రామచంద్రుడితడు ||

Advertisement

తాజా వార్తలు

Advertisement