Friday, April 26, 2024

అన్నమయ్య కీర్తనలు : నీకే శరణంటి

రాగం : సింహేంద్రమధ్యమం

నీకే శరణంటి నిన్నే నమ్మితినయ్య
పైకొని శ్రీహరి నీవే పరిహంచవే || ||నీకే శరణంటి||

విజ్ఞానములు కొన్ని విందు నే నూరకే
సుజ్ఞానములు కొన్నిచూతు నే నేపొద్దు
అజ్ఞానము నే ననిశము నడచేది
ప్రజ్ఞహీనుడ నెంత పాపకర్మమో || ||నీకే శరణంటి||

సుకృతము లొకమరి సొరిది నే బోధింతు
ప్రకృతి యొక్కొక్కవేళ భావింతు నాత్మలో
ఆకృతములే నే నశినము జేసేది
వికృతచారుడ నింకా వికార మెంతో || ||నీకే శరణంటి||

ధర్మమార్గము కొంత తలపున నెరగితి
ని ర్మలచిత్తమై మోక్షనిలయము నెరిగితి
నిర్మించి శ్రీ వేంకటేశ నీవు నన్ను నేలగాను
మర్మమెరిగితి నెట్ల మన్ననగాచితివో|| ||నీకే శరణంటి||

Advertisement

తాజా వార్తలు

Advertisement