Saturday, April 20, 2024

అన్నమయ్య కీర్తనలు : అలరులు కురియగ

అలరులు కురియగ నాడెనదే
అలకల కులుకుల నలమేల్మంగ ||

అరవిరి సొబగుల నతివలు మెచ్చగ
అరతెర మరుగన నాడెనదే
వరుసగ పూర్వదువాళపు తిరుపుల
హరి కరగింపుచు నలమేల్మంగ ||

మట్టపు మలపుల మట్టెల కెలపుల
తట్టెడి నడపుల దాటెనదే
పెట్టిన వజ్రపు పెండెపుతళుకులు
అట్టిటు చిమ్ముచు నలమేల్మంగ ||

చిందుల పాటల సిరిపొలయాటల
అందెల మ్రోతల నాడెనదే
కందువ తిరు వేంకటపతి మెచ్చగ
అందపు తిరుపుల నలమేల్మంగ ||

Advertisement

తాజా వార్తలు

Advertisement