Friday, March 29, 2024

అన్నమయ్య కీర్తనలు : అపరాధిని నేనైనాను

రాగం : మేఘరంజని
అపరాధిని నేనైనాను
కృపగలవారికి కపటము లేదు || ||అపరాధిని నేనైనాను||

సనాతనా అచ్చుతా సర్వేశ్వరా
అనాదికారణ అనంతా
జనార్దనా అచల సకలలోకేశ్వరా
నిను మరచియున్నాడ నను తెలుపవయా || ||అపరాధిని నేనైనాను||

పురాణపురుషా పురుషోత్తమా
చరాచరాత్మక జగదీశా
పరాత్పరా హరి బ్రహ్మాండనాయకా
యిరవు నీవేయట యెరిగించగదే || ||అపరాధిని నేనైనాను||

దేవోత్తమా శశిదినకరనయనా
పావనచరితా పరమాత్మా
శ్రీవేంకటేశా జీవాంతరంగా
సేవకుడను బుద్ధిచెప్పగవలయు || ||అపరాధిని నేనైనాను||

Advertisement

తాజా వార్తలు

Advertisement