Thursday, April 25, 2024

అన్నమయ్య కీర్తనలు : అంతర్యామి అలసితి

రాగం : శివరంజని

ప|| అంతర్యామి అలసితి సొలసితి
యింతట నీ శర ణిదే చొచ్చితినీ

చ|| కోరిన కోర్కెలు కోయని క ట్లు
తీరవు నీవవి తెంచక
భారపు పగ్గాలు పాపపుణ్యములు
నేరపులబోవు నీవు వద్దనకా

చ|| జనుల సంగముల జక్కరోగములు
వినువిడువవు నీవు విడిపించక
వినయము దైన్యము విడువని కర్మము
చనదది నీ విటు సంతపరచకా

చ|| మదిలోచింతలు మయిలలు మణుగులు
వదలవు నీవని వద్దనకా
యెదటనే శ్రీ వేంకటేశ్వర నీవదె
అదనుగాచితివి అట్టిట్టనకా

Advertisement

తాజా వార్తలు

Advertisement