Friday, March 29, 2024

అందమైన కల్పనలు అవాల్మీకాలు-2

చాకలివాడు రాముని తప్పుపట్టడం

ఒక చాకలివాడు తన భార్య మీద కోపంతో సీతమ్మ వారిని రావణుడు ఎత్తుకెళ్ళి అశోకవనంలో ఉంచిన విషయం, శ్రీ రాముడు సీతమ్మను తిరిగి తీసుకువచ్చిన సందర్భం శ్రీరాముని తప్పుపట్టినట్లు ఒక కథ బహుళ ప్రచారంలో ఉంది. కానీ వాల్మీకి రామాయణంలో అసలు చాకలివాడు రాముని తప్పుపట్టినట్లు లేదు. రామాయణంలో ఇలా ఉంది. శ్రీరాముడు ఆసీనుడై ఉండగా హాస్య వినోద కథలు చెప్పడంలో నేర్పరులైన మధుమత్తుడు, కాశ్యపుడు, పింగళుడు, కుటుడు, సురాజుడు, కాళీయుడు, భద్రుడు, దంతవక్త్రుడు, సుమాగధుడు అనువారు వినోదాత్మక కథలు వివరిస్తున్నారు. ఈ సందర్భంలో ఒక కథా ప్రసంగం జరుగుతున్నప్పుడు రాముడిలా అన్నాడు.
తత: కథాయాం కస్యాంచిత్‌ రాఘవస్సమ భాషత, కా: కథా నగరే భద్ర వర్తంతే విషయేషుచ, మామా శ్రితాని కాన్యాహు: పౌర జానపదా జనా: కించ సీతాం సమాశ్రిత్య భరతం కించ లక్ష్మణమ్‌, కింసు శత్రుఘ్నముద్దిశ్య కైకేయీం కింసు మాతరమ్‌ వక్త వక్తవ్యతాంచ రాజానో నరే రాజ్యే వ్రజంతిచ కైకేయీం కింసు మాతరమ్‌ వక్త వ్యతాంచ రాజానో నరే రాజ్యేవ్రజంతి చ
(వాల్మీకి రామాయణం 43వ సర్గ, శ్లో.3-6). రాముడన్నాడు ”భద్రా! నగరంలో జరుగుచున్న విశేషములేవి? పౌరులు, జానపదులు ( గ్రామీణులు) నన్ను, సీతను, భరత లక్ష్మణ, శత్రుఘ్నులను, కైకేయి మాతను గురించి ఏమనుకుంటున్నారు. సువిశాల రాజ్యంలో రాజుల గుణ దోషాల గురించి ప్రజలు చర్చించుకోవడం సహజం కదా! యథార్థ విషయాలన్నింటినీ పూర్తిగా తెల్పుము. నేను చేసిన కార్యముల విషయంలో పౌరులనుకుంటున్న మంచి చెడ్డల గురించి వివరించు. అవి విన్నాక ఈ క్షణం నుంచే మంచి వాటిని ఆచరింపగలను. నాలో దోషాలుంటే వదిలి వేస్తాను. నీవు నాకు విశ్వాస పాత్రుడవు. పురమునందు, జనపదములందు గల ప్రజలు అనుకుంటున్న నా దోషముల గురించి నిర్భయంగా, నిస్సంకోచంగా, యథా తథముగా తెలుపుము”. ( శ్లోకము 7-11).
భద్రుడిలా చెప్పాడు. ”మహారాజా! దయతో ఆలంకించండి. కూడళ్ళయందును, నాలుగుదారులు కలియుచోట్లలో, అంగళ్ళ యందు, రాజ మార్గములందు, వనములందు, ఉపవనము లందు, మీ గుణ దోషముల గురించి ప్రజలు ఇలా మాట్లాడుకుం టున్నారు. శ్రీరాముడు మహా సముద్రంపై ఒక అద్భుతమైన సేతువు నిర్మించాడు. ఇంతకు ముందువారు కానీ, దేవ దానవులు కానీ, ఇంతటి మహా కార్యము సాధించినట్లు మనం విని యుండలేదు. ఈ మహావీరుడు దుర్జéయుడైన రావణుని, అతని సేనా పరివారాలను
యుద్ధంలో సంహరించాడు. సహజంగానే చిత్త్తచాంచల్యం గల వానరులను, భల్లూక వీరులను, క్రూర స్వభావులైన రాక్షసులను అదుపు చేశాడు. యుద్ధ రంగంలో రావణుని వధించాక శ్రీరాముడు రోషము విడిచి, సీతాదేవిని స్వీకరించి, ఆమెను మరల తన భవనానికి తీసుకువచ్చాడు(శ్లో. 12-16).
కీ దృశం హృదయే తస్య సీతా సంభోగజమ్‌ సుఖమ్‌ అంక మారోప్యతు పురా రావణన బలాద్ధృతామ్‌
సీతాదేవితో కూడి సుఖించుటకై శ్రీరాముని మనస్సు ఇలా ఇష్ట పడుతోంది? లోగడ రావణుడు ఆమెను బలవంతంగా అప#హరించి తన అంకమున (ఒడి) చేర్చుకుని లంకకు తీసుకు వెళ్ళాడు. తర్వాత అతడామెను రాక్షసుల అదుపులో అశోకవనంలో వుంచాడు. ఎంతో కాలము పరుల పం చన వున్న తన భార్యను రాముడెందుకు ఏవగించుకో వడం లేదు. ఇక మీదట మనం కూడా మన భార్యలందు ఇలాంటి సహనమే చూపాల్సి రావచ్చు. రాజు మార్గమునే ప్రజలు అనుసరింతురు కదా. రాజా! నగరమందు ను, అన్ని జనపదాల లోను ప్రజలు ఇలా పెక్కు రీతుల నోటికి వచ్చినట్లు మాట్లాడుకుం టున్నారు. అని భద్రుడు చెప్పాడు. (శ్లోకము 17 – 20)ఇది వాల్మీకి రామాయణంలోని ఉత్తరకాండ 43వ సర్గములో ఉంది.ఇందు లో ఎక్కడ చాకలివాడు రాముని తప్పుపట్టినట్లు లేదు. మరి ఈ కాల్పనిక కథ ఎక్కడది? జైమిని భారతం 26వ అధ్యాయం అశ్వమేధ పర్వంలో ఈ రజక వత్తాంతం ఉంది. రాముడు అర్ధ రాత్రి దాటాక తనను తాను విడిగా కలుసుకున్న ఒక గూఢాచారితో లోకులేమనుకుంటున్నారో ఉన్నది ఉన్నట్లు చెప్ప మని అడిగిన ప్పుడు ఆ గూఢాచారి ఒక చాకలివాడు భార్యను తనకు అప్పగించ బోయిన తన మామతో నేను రాకాసుల ఇంట్లో ఉన్న సీతను తెచ్చు కుని అట్టే పెట్టుకున్న రాముడిననా మీ అభిప్రాయం అన్నడని మాత్రమే చెబుతాడు. అలసలు ఈ గూఢచారి పేరు జైమిని భారతంలో లేదు. ఈ కథ అవాల్మీకం. కానీ ప్రజా బాహుళ్యంలోకి వేగంగా వెళ్లిపోయి,వాల్మీకి చెప్పాడన్న అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయింది.
రావణ కాష్టం – మండోదరి నిత్య సుమంగళిత్వం
వాల్మీకి రామాయణంలో లేని విరివిగా ప్రచారంలో ఉన్న మరియొక కాల్పనిక ఉదంతం ఏమిటంటే రావణ వధ జరిగాక అతని పట్ట మ#హష మండోదరి రాముని కలుసుకుని తీవ్రంగా దు:ఖించిందని, రాముడు ఆమెను ఓదారుస్తూ ”అమ్మా నీ భర్త రావణుని కాష్టం నిత్యం కాలుతూనే ఉంటుంది. అది ఎప్పుడు ఆరిపోదు. అయినా నీవు నిత్యం సుమంగళిగానే ఉంటావు” అని వరమిచ్చాడని చాలా మంది ఇప్పటికీ అనుకొంటూ వుంటారు. అందువలననే దేశంలో ఎప్పటికీ తీరని సమస్య ఏదైనా ఉంటే దానిని రావణ కాష్టం అని పిలవడం సమాజంలో ఆనవాయితీగా వస్త్తోంది. యుద్ధానంతరం మండోదరి రావణుని శవంపై పడి విలపించడం ఉంది కాని ఆమె రాముడి నుంచి వరం పొందింది అనడానికి ఆధారాలు లేవు. మరి ఈ కథ ఎక్కడిదో తెలియదు.
వాల్మీకి రామాయణం 114వ సర్గలో ఉన్న అంశం ఏమిటంటే (యుద్ధకాండ శ్లోకాలు 97 – 116) రావణ వధానంతరం రాముడు విభీషణుడి తో ‘మరణాంతాని వైరాని’ మనిషి మరణించే వరకే శత్రుత్వ ము.ఆ తర్వాత శత్రు భావం ఉండరా దు. నీవు నీ అన్నకు అంతిమ సంస్కా రం చేయుము అని చెప్పాడు. విభీషణు డు వేగంగా ఏర్పాట్లు చేశాడు. మంచి గంధపు చెక్కలతో, పద్మకములు, వట్టి వేళ్ళు మొదలైన సుగంధ ద్రవ్యాలతో చితిని సిద్ధపరిచారు. దానిపై వేదోక్తంగా ఒక జంతువు చర్మం కప్పబడింది. వేద మంత్రాలతో అంత్యేష్టి కొనసాగింది. పితృ మేధ సంస్కారములు చితిపై ఉంచుట అనే క్రియలు యధావిధిగా జరిగాయి. ఆ చితికి ఆగ్నేయ దిశగా ఒక వేదిక నిర్మించారు. ఆ వేదికపై పడమర గార్హ పత్యాగ్నిని, తూర్పు దిక్కుగా ఆ#హవనీయాగ్నిని, దక్షిణ భాగాన దక్షి ణాగ్నిని ప్రతిష్ఠించారు. తర్వాత నెయ్యి, పెరుగు కలిపిన #హవి
స్సును సుక్‌ స్రువాల ద్వారాŒ చితిలో అ#హుతిచ్చారు. శవాన్ని తెచ్చిన శకటాన్ని రావణుని కాళ్ళ వద్ద ఉంచారు. #హూమధాన్యాలు దంచడానికి ఉపయోగించిన రోలుని అతని తొడల మధ్య ఉంచారు. చెక్క పాత్రలను, అరణులను, ముసలము, మొదలైన స్థాల్యాదికములను రుత్విజులు, యథాస్థానంలో ఉంచారు. వేద #హతంగా చితికి సమీపంలో మంత్రపూతమైన మేకను బలి ఇచ్చారు. తర్వాత నేతితో తడిపిన పరిస్తరములను (అగ్నికి నాలుగు వైపుల ఉంచే దర్భలను) ఉంచారు. రావణుని దేహాన్ని సుగంధ ద్రవ్యాలతో, పూల మాలలతో, వివిధ వస్త్రాలతో అలంకరించి, కన్నీరు కారుస్తూ పేలాలు చల్లిన విభీషణుడు విధ్యుక్త ధర్మంగా చితికి నిప్పంటించాడు. తర్వాత స్నానం చేసి తడి బట్టలతో తిలలు, గరికపోచలు చేతిలో ఉంచుకుని శాస్త్రోక్తంగా తర్పణ విధులు చేశాడు. ఇంత మాత్రమే వాల్మీకి రామాయణంలో ఉంది.
అలాగే బాల్యంలో ముద్దులొలికే రాముడు ఆకాశంలొని చందమామ కావాలని ఏడ్చాడని, దశరథుడు దిక్కుతోచక తల్లడిల్లాడని, మంత్రి సుమంతుడుడ ఎలవిగా అద్దం రాముని చేతికిచ్చి అందులో చంవదమామాను చూపిస్తే బలరాముడుడ ఆనందించాడని ఒక అద్భుత కాల్పనిక గాథ ప్రచారంలో ఉంది.
అరణ్యవాస సమయంలో డంగారు జింక కోసం వెళ్ళిన రాము డిని వెతు కుతూ పోయేసమ యంలో సీతమ్మ రక్షణకు లక్ష్మణ రేఖ గీశాడని, ఒక కథ ప్రజల హృదయం లో సుస్థిరం గా ఇప్పటికీ నిలిచే ఉంది. వాల్మీకంలో కేవలప్రకృతిని,వన దేవతలను ప్రార్థిం చి వెడతాడు. కథలెన్నో ప్రచారం లో ఉన్నా అన్నింటికీ మూల కథా వస్తువు వాల్మీకి రామాయణమే కదా!
ఓం తత్సత్‌

డాక్టర్‌. గొల్లాపిన్ని సీతారామశాస్త్రి
94407 81236

Advertisement

తాజా వార్తలు

Advertisement