Friday, April 26, 2024

అంజనీపుత్రునికి తప్పని సంకెళ్ళు!

అంజనీపుత్రుడు, పవన పుత్రుడు, ఆంజనేయు డు, వీరహనుమాన్‌, వీరాంజనేయుడు, భజరంగబలి ఇలా అనేక పేర్లతో భక్తులు కొలిచే దేవుడు ఆంజనేయస్వా మి. సీతారాముల దాసునిగా, రామభక్తునిగా హిందూమ తంలో అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు భక్తులు. నిర్మల మనస్సుతో ఆంజనేయస్వామిని ఆరాధిస్తే అన్ని కష్టాలు తీరతాయని భక్తుల విశ్వాసం. ఆంజనేయస్వామి జీవితం గురించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా ఆంజనేయస్వామి గురించి రామాయణంలో ప్రముఖం గా రామభక్తుడు, రామ సేవకుడు, రామబంటుగానే ప్రస్తా వన ఉంది. అందులో భాగంగానే ఆంజనేయస్వామి ఐదు రూపాల గురించి కూడా పేర్కొన్నారు. అయితే బేడి హను మాన్‌ గురించి మాత్రం చాలామందికి తెలియక పోవచ్చు. భారతదేశంలో రెండు ప్రసిద్ధి చెందిన బేడీ ఆంజనేయస్వామి ఆల యాలు వున్నాయి. అవి ఏమిటంటే –

తిరుమల కొండపై
బేడీ ఆంజనేయుడు

తిరుమలలో శ్రీవారి ఆల యానికి ఎదురుగా సన్నిధివీధి లో స్వామికి అభిముఖంగా గుట్ట పై అంజలి బద్ధుడై ఉన్న ఆంజనేయ స్వా మి కొలువై వున్నారు. ఈ స్వామినే బేడీ ఆంజనేయస్వామి అంటారు. శ్రీరా ముడు హనుమంతుడిని మొదటిసారిగా ఇక్కడ కలిశాడని ఒక కథనం. హనుమంతుడు చిన్నతనం లో అల్లరిచేస్తూ కొంటెగా వుండటంతో అతని తల్లి అంజనా దేవి ఆయన చేతులకు, కాళ్ళకు బేడీలు తగిలించిన మూర్తిగా అంజనీ పుత్రునికి ఆ పేరు వచ్చింది.
అంజనాదేవి తిరుమలలో తపస్సు చేసి కుమారుడిని కన్నదని ప్రతీతి. బాల్యంలో హనుమాన్‌ చాలా అల్లరి చేసేవాడు. కుమారుడి అల్లరి కట్టడి చేయడానికి అంజనా దేవి బాల హనుమాన్‌ చేతులకు బేడీలు వేసి తాను తిరిగి వచ్చేవరకు అక్కడే ఉండమని ఆదేశించి ఆ వేంకటేశ్వరస్వా మికి ఎదురుగా నిలబెట్టింది. తల్లి తిరిగి వచ్చేవరకు అక్క డే వుంటానని ఆమెకు మాట ఇచ్చాడు. ఆమె హిమాలయా లకు వెళ్ళి, కొన్ని కారణాలవల్ల తిరుమల కొండకు తిరిగిరా లేదు. తల్లి ఆజ్ఞను పాటించి బాల హనుమంతుడు ఇప్పటికీ అక్కడ నిలబడి ఉన్నాడని మరో కథనం.తన ప్రియమైన శిష్యుడు తన ఆలయం ముందు ఒంటరిగా నిలబడి ఉండ టం చూసి, శ్రీ వేంకటేశ్వరస్వామి తన ఆలయ పూజారుల ను ప్రతిరోజూ బాలహనుమంతుడికీ సకాలంలో ఆహారం అందించమని అతని తల్లి తిరిగివచ్చేవరకు అతనిని బాగా చూసుకోవాలని ఆదేశిస్తాడు. ఈ కారణంగానే ప్రతిరోజు శ్రీ వేంకటేశ్వరునికి, వరాహస్వామికి నైవేద్యం సమర్పించిన ప్పుడు అదే నైవేద్యాన్ని ఈ ఆలయానికి తీసుకువచ్చి హను మంతుడికి నైవేద్యంగా సమర్పిస్తారు.
తిరుమలలోని ఈ బేడి ఆంజనేయస్వామి ద్వైత అను చరులకు ఆరాధ్య దైవం అయితే విశిష్టాద్వైతులకు ఔత్తరా హులకు పౌరుషావతార మూర్తి. అన్నమయ్య స్వామిని అనేకవిధాలుగా కీర్తించాడు. ఈ ఆలయ ప్రాంగణంలో గోవింద రాజాచార్యులు గోవింద రాజేయం పేరుతో శ్రీమ ద్రామాయణానికి భాష్యం రాశారు. ప్రతి బ్రహ్మోత్సవానికి ఇక్కడి నుంచి స్వామివారికి వస్త్రాలు, బహుమతులు ప్రభు త్వం ఆదేశానుసారం తీసుకువెళతారు.
హనుమంతుడు చేతులకు సంకెళ్లు వేసుకుని స్వామికి నమస్కరిస్తున్న భంగిమలో ఈ ఆలయంలో కనిపిస్తాడు. ఆలయం ముందు అఖిలాండం లేదా అఖండం (అంతులే ని జ్వాల) ఉంటుంది. భక్తులు స్వామిని దర్శించుకున్న త ర్వాత అఖండం వద్ద కొబ్బరికాయలు పగలగొట్టి తమ ప్రమాణాలను సమర్పించుకుంటారు.

పూరీలో దారియా మహావీర ఆలయం

భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రా లలో ఒకటి ఒడిస్సాలోని పూరీ జగన్నా థస్వా మి దేవాలయం. ఈ క్షేత్రంలో ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఒకటి ఉంది. ఈ ఆల యాన్ని దారియా మహావీర దేవాలయమని కూడా పిలు స్తారు. ఈ ఆలయంలో ఆంజ నేయస్వామి సంకెళ్లతో బంధిం చి వుంటాడు. ఇలా ఉంచడానికి స్థల పురాణం ఉంది.
జగన్నాథుడు ఈ పుణ్యక్షేత్రం లో వెలసిన తర్వాత జగన్నాథుని దర్శ నానికి సముద్ర దేవుడు ఈ దేవాలయాన్ని సందర్శించాడు. అలా సముద్ర దేవుడు రావడంతో సము ద్రంలోని నీరు అంతా ఈ ప్రదేశంలోకి చేరి అపార హాని జరిగింది. అక్కడ ప్రజలు సముద్రుడి నుంచి తమని రక్షిం చమని జగన్నాథుని ప్రార్థించారు. భక్తుల ప్రార్థనలకు ప్రస న్నుడైన జగన్నాథుడు తన రక్షకుడైన ఆంజనేయుడు గురించి విచారించగా హనుమంతుడు తన అనుమతి లేకుండా అయోధ్య వెళ్లినట్లు తెలుసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన జాగన్నాథుడు ఈ క్షేత్రాన్ని పగలు, రాత్రి కాపలా కాచే బాధ్యతలు ఆంజనేయుడు మరచిపోయాడని భావించి ఆంజనేయుడి కాళ్లు చేతులకు పగ్గంతో కట్టివేసి… ఇకముందు ఇక్కడే సదా వెలసి వుండు… ఈ క్షేత్రంలోకి సముద్రపు నీరు చేరకుండా కాపలా కాయి అని చెప్పాడట. అప్పటి నుంచి ఈ హనుమంతుడు సంకెళ్లతో దర్శనమి స్తాడు. అప్పటి నుంచి ఈ స్వామిని దారియా మహావీర అని కూడా పిలుస్తారు. దారియా అంటే సముద్రం అని అర్థం. అంటే మహావీరుడైన హనుమంతుడు సముద్రం నుంచి తమ మహానగరాన్ని కాపాడుతున్నాడని ప్రజల నమ్మకం. ఆంజనేయస్వామిని బేడీ హనుమంతుడని కూ డా పిలుస్తారు. ఇక్కడ కొలువై వుండటంతో ఈ క్షేత్రం సము ద్ర తీరం దగ్గరగా వున్నా కూడా ఎటువంటి తుఫాను సంభ వించినా సముద్రపు నీరు రాదని స్థానికులు చెబుతారు.
పూర్వం దేవస్థానానికి పాలకులైన మహంతులు పూరీ జగన్నాథస్వామి ఆలయ సంప్రదాయం ప్రకారం బేడీ ఆంజనేయుని స్వామివారి ఎదు రుగా నిలిపారని కూడా అంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement