Tuesday, October 26, 2021

స్వర్ణ కవచాలంకృత‌ దుర్గాదేవి

భవానీ భావనాగమ్యా భవారణ్య కుఠారికా
భద్ర ప్రియా భద్రమూర్తి ర్భక్తసౌభాగ్యదాయినీ!!
సర్వ మంగళమాంగల్యే శివే సర్వార్థసాధికే
శరణ్య త్య్రమ్బకే దేవి నారాయణి నమోస్తుతే!!

శ్రీమాతను ఆరాధించే విధానమును శ్రీ మార్కండేయ మ#హర్షికి బ్ర#హ్మ చెప్పినట్లు మనకు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆశ్వీ యుజు శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు శరన్నవ రాత్రులుగా మనం జరుపుకునే దసరా ఉత్సవాలలో శక్తి రూపిణి అయిన దుర్గామాతను వివిధ రూపాలలో ప్రత్యేక పూజలతో పూజిస్తాము.
శక్తి ఆరాధన చేయదలచినవారు ప్రథమంగా గణపతిని పసుపుతో ప్రతిష్టించి నిర్విఘ్నంగా నవ రాత్రుల దుర్గాపూజ పూర్తిగావించి అఖండ ఫలితాలను ఆ తల్లి అనుగ్ర#హంతో పొందాలనే సంకల్పం చెప్పు కోవాలి. నవరాత్రి కలశను ప్రతిష్టించి, నవధాన్యాలను కూడా ఒక పాత్రలో ప్రక్కనే పెట్టుకుని పూజా జలమును అందులో నిక్షిప్తం చేస్తూన్నట్లయితే మొలకలు వచ్చి చక్కగా పెరిగినట్లయితే అమ్మ ఆశీర్వాదము మనకు లభ్యమైనట్లుగా భావించవచ్చు.
నవరాత్రులు శక్తికి ప్రతిరూపం కాబట్టి సక్రమంగా జరిపే పూజ అద్భుత మైన ఫలితాలను ప్రసా దిస్తుంది. అదేవిధంగా ఆచార విరుద్ధంగా సాగించే పూజలతో చెడు ఫలితాలు కూడా చవి చూడవలసి వస్తుంది. ఎంతో జాగరూకత అవ సరము. కలశ స్థాపన వీలుకాకపోతే
మామూలుగా
కూడా తల్లిని పూజింపవచ్చును. నైవే ద్యం విషయంలో కూడా శక్తి కలిగిన విధంగా చేయవచ్చు. మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏమంటే భక్తి ప్రధానము. ఆరోగ్య రీత్యా వీలు కుదరని వారు ఉదయం అల్పాహారం తీసుకుని పూజ నిర్వ #హంచవచ్చు. శరీరం నిలబడితేనే పూజ చేయ గలుగుతాము.
ప్రథమంగా మొదటి రోజుపాడ్యమి నాడు స్వర్ణ కవచ అలంకారంతో దుర్గాదేవిని విధివిధానాలతో, షోడశోపచార పూజలతో పూజిస్తారు. ఆ రోజు చేమంతి పూలను పూజకు వినియోగిస్తారు. దుర్గా అష్టోత్తర నామములతో పూజ చేసి, పులిహోర నైవేద్యంగా
సమ ర్పిస్తారు.
శ్రీశైలంలో ఈ రోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో విజయవాడ కనకదుర్గ స్వర్ణక వచాలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు.
ఈ నవరాత్రి వ్రతము చేయు వారు ఏకభుక్తము చేయాలి. ప్రతి రోజూ ఉదయము, సాయంత్రము అమ్మవారి పూజా విధివిధానాలతో చేయాలి. నవరాత్రులలో ఇంటికి వచ్చే ముత్తయిదువులను దుర్గాదేవి గా తలచి వారికి యధాశక్తి తాంబూ లము సమర్పించుకోవాలి.
”ప్రథమా శైలపుత్రీచ, ద్వితీయ బ్ర#హ్మచారిణి, తృతీయ చంధ్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకీ, పంచమాస్కంద మాతేతి, షష్టా కాత్యాయనేతిచ, సప్తమా కాళరాత్రీచ, అష్టమాచాతి భైరవీ, నవమా సర్వసిద్ధిశ్చాత్‌ నవదుర్గా ప్రకీర్తితా.”
శుభం భూయాత్‌ !!

– డా. దేవులపల్లి పద్మజ
98496 92414

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News