Thursday, July 29, 2021

సంపూర్ణ జ్ఞానంలో ”ఆత్మనిశ్చయం” యొక్క మహత్యం (ఆడియోతో…)

ఇపుడు మీకు ఆలోచన మొదలవుతుంది ”ఆత్మ నిశ ్చయంలో ఉండాలి” ఇది మొత్తం జ్ఞానానికి పునాది. ఎందుకంటే ఆత్మిక జ్ఞానం ప్రారంభమయ్యేదే ఆత్మతోటి. మనలను మనం ఆత్మగా భావించకుండా దేహంగా భావించనట్లయితే జ్ఞానాధరమే నశిస్తుంది. ఆత్మయే లేకపోతే పునర్జన్మలు ఎవరివి ఎలాగ? ఆత్మయే లేకపోతే కర్మల ఖాతాలే తోడురావు. మరి మనం మంచి కర్మ ఎందుకు చేయాలి? చెడు కర్మల నుండి ఎందుకు రక్షించుకొనాలి? ఆత్మయే లేకపోతే మహాత్మ, పరమాత్మల, అస్తిత్వమే (ఉనికి) లేదు. ఆత్మగా భావించకపోతే పూర్వం మనస్థితి ఎలా వుంది? మనం ఎపుడు ఏ విధంగా అపవిత్రులు అయ్యాము. ఇపుడ పావనంగ అగుట వలన మనకు సద్గతి ఎలా కలుగుతుంది? ఇవన్నీ గ్రహించజాలము. కావున ”ఆత్మ నిశ్చయానికి” చాలా మహత్వమున్నది. ఇది లేకుండా ముక్తి – జీవన్ముక్తి, యోగం, దివ్య గుణాలు మొదలగు చర్చ కూడా నిరర్దకమవుతుంది. తరువాత జ్ఞానమునగా ఏ విషయము ఎలా ఉన్నదో దానిని అదే విధంగా గ్రమించుట. రోజంతా మనం వేలసార్లు నేను, నేను అను శబ్దాన్ని ప్రయోగిస్తుంటాము. ఈ నేను అనే శబ్దం దేనికి గుర్తు? నేను దేహాన్నా? లేక ఆత్మనా? ఈ విషయం గురించి తెలుసుకునగలము? ఈ విధంగా ముందు ఆత్మల నిశ్చయం చేసుకొనే అవసరం చాలా ఉంది. ఒక వేళ జ్ఞానవంతుడైన వ్యక్తితనను తాను ఆత్మ నిశ్చయం చేసుకోక పోతే జ్ఞానికి, అజ్ఞానికి భేదమే ఉండదు.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News