Saturday, June 19, 2021

శ్రీ స్వామి అయ్యప్ప స్తుతి:

1. ఓం భూతానాథ సదానంద: సర్వభూత దయాపర
రక్ష రక్ష మహాబాహు: శాస్తారం త్వాం నమామ్యహం
2. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం
పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం
3. విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభు ప్రియంసుతం
క్షిప్ర ప్రసాద నిరతమ్‌ | శాస్తారం ప్రణమామ్యహం
4. మత్తమాతంగ గమనం | కారుణ్యామృత పూరితం |
సర్వవిఘ్నహరం దేవం | శాస్తారం ప్రణమామ్యహం
5. అస్మత్‌ కులేశ్వరం దేవం అస్మత్‌ శత్రు వినాశనం
అస్మదిష్ట ప్రదాతారం శాస్తారం ప్రణమామ్యహం
6. పాండ్యేశ వంశ తిలకం భారతీ కేళి విగ్రహం
ఆర్తత్రాణ పరం దేవం శాస్తారం ప్రణమామ్యహం
7. పంచరత్నాఖ్య మేతద్యో నిత్యం శుద్ద: పఠేన్నర:
తస్య ప్రసన్నో భగవాన్‌ శాస్తారం ప్రణమామ్యహం
8. అరుణోదయ సంకాశం| నీలకుండల ధారిణం
నీలాంబరధరం దేవ – వందేహం బ్రహ్మనందనం ||
9. చాపబాణం వామహస్తే – రౌప్యవేతన రజ్ఞదక్షిణ|
విలసత్‌ కుండల ధరం – వందేహం విష్ణు నందనం||
10. వ్యాఘ్రారూఢం రక్తనేత్రం – స్వర్ణమాలా విభూషణం
వీరాట్టధరం దేవం – వందేహం నందనం ||
11. కింకిణి దండ్యాణ సద్భూషం పూర్ణ చంద్ర నిభాననం |
కిరాత రూప శాస్తారం | వందేహం పాండ్య నందనం |
12. భూతభేతాళ సంసేవ్యం | కాంచనాద్రి నిభాననం |
మణికంఠ మితిఖ్యాత | వందేహం శక్తి నందనం ||
13. యస్య ధన్వంతరీ మాతా| పితారుద్రోభిషక్‌ నమ: ||
శాస్తారం త్వామహం వందే | మహావైద్యం దయానిధిం ||

Advertisement

తాజా వార్తలు

Prabha News