Monday, October 18, 2021

శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు జడ్జి

తిరుమల, ప్రభన్యూస్‌: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని సుప్రీంకోర్టు జడ్జ్‌ జస్టిస్‌ పిఎస్‌.నరసింహ కుటుంబ సభ్యులతో కలసి ఆదివారం ఉదయం విఐపి విరామ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయంలోకి చేరుకున్న ఆయనకు టిటిడి చైర్మెన్‌ వైవి.సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డిలు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచం పలుకగా టిటిడి చైర్మెన్‌, ఈవో, అదనపు ఈవోలు శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు, కాఫి టేబుల్‌బుక్‌ అందచేశారు. అనంతరం సుప్రీంకోర్ట్‌ జడ్జ్‌ నరసింహ కల్పవృక్ష వాహన సేవలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News