Saturday, October 23, 2021

శారీరక బాధ

భగవంతుడి నుండి ఎంతటి ప్రేమను అనుభవం చేయవచ్చునంటే ఎటువంటి బాధ వచ్చినా ఆ బాధ బాధగా అనిపించదు. భగవంతుడిని తల్లిగా భావించి, వారు మనల్ని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఒక క్షణంలో బాధను తీర్చేస్తున్నట్లుగా అనుభవం చెయ్యండి.

ఏడవడం కన్నా ఇది ఎంతో మేలు (ఏడవడం వలన ఏ విధమైన ప్రయోజనమూ ఉండదు), అంతేగాక అది ఆధ్యాత్మిక విజయము అవుతుంది.

బాధల్లో ఓర్పును వహించండి, అది మీకు ఏదో పాఠాన్ని నేర్పించడానికి ప్రయత్నిస్తుంది, బాధను చూడకండి, అందుకు బదులుగా పాఠాన్ని చూడండి.

భగవంతుని స్మరణయే నాణ్యమైన వైద్యం, సంతోషానికి, బాధకు ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోండి. ఆ సంబంధం ఇంద్రాజాలికుడు వంటిది, అది బాధను మాయమైపోయేట్లుగా చేస్తుంది.

భగవంతునిపై అమితమైన విశ్వాసంతో నీ శరీరం నుండి అనాసక్తుడిగా అవ్వు, అప్పుడు బాధ త్వరగా మాయమైపోతుంది.

–బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News