Sunday, October 17, 2021

యమ రావణ సంగ్రామం

పుష్పక విమానంలో ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ రావ ణుడు నారద మహర్షిని చూశాడు. పుష్పకాన్ని ఆపి, నారదునికి నమస్కరించి కుశలం అడిగాడు. నారదుడు భూలోకానికి రావణుని పీడ తొలగింప తలచుకున్నాడు. రావణుని సాహసాన్ని, పౌరుష ప్రతాపాలను, అజేయత్వాన్ని కీర్తించాడు. ”మానవులకు ఎప్పుడైనా చావు తప్పదు. నీవు చంపకపోయినా కాలం మూడినప్పుడు వారు చస్తారు. ఈ అల్ప ప్రాణులపై నీ ప్రతా పం చూపడం పౌలస్త్య వంశానికి సిగ్గుచేటు! నీ కీర్తికి కళంకం. మాన వులందరినీ మృత్యువు పాలు చేసేవాడు యముడు. నీకు చేతనైతే మృత్యురూపుడైన యమునితో పోరాడి, అతని పస ఏ పాటిదో లోకా లకు వెల్లడింపు. అప్పుడు నీవు లబ్ద ప్రతిష్టుడవు కాగలవు! అది నీ కీర్తికి వన్నె తేగలదు” అని పురి కొల్పాడు నారదుడు.
నారదుని ఎత్తుగడ ఫలించింది. రావణుడు యమునితో యుద్దానికై ఉర్రూతలూగిపోయాడు. ”మునివరా! దిక్పాలకులను మట్టి కరిపించాలి అనుకొన్నాను. కుబేరుని భరతం పట్టాను. వరు ణునిపై దాడి చేయబోతున్నాను. తరువాత ఇంద్రియాల పని పట్టా లనుకున్నాను. నా శ్రేయోభిలాషివైన నీవు యమునిపై దాడి చేయ మంటున్నావు! నీ మాటకు గౌరవం ఇస్తున్నాను. మొదట యముని దండించి, తరువాత తక్కిన దిక్పాలకుల పీచం అణచగలను” అని పలికిన రావణుడు దక్షిణ దిక్కుకు పయనించాడు. నారదుని కడుపు నిండే సమయం ఆసన్నమైంది. కలహ భోజనుడు కదా! యమ రావ ణుల సంగ్రామం కనులకు విందు, కడుపునకు విందును చేకూరు స్తుందని తహతహలాడుతూ, ఆకాశమార్గంలో యముని దిక్కు నకు వెళ్ళాడు. రావణుని కంటే ముందుగా నారదుడే యమలోకం చేరాడు. ”లంకేశ్వరుడైన రావణుడు యమలోకంపై దాడి చేయబో తున్నాడు. రావణుని ధాటికి నీవు ఏమవుతావో అని, నిన్ను అప్ర మత్తుని చేయాలని శీఘ్రగామినై వచ్చాను” అన్నాడు నారదుడు.
ఇంతలో రావణుడు యమలోకాన్ని సమీపించాడు. దారి పొడవునా నరకయాతనలు అనుభవిస్తున్న పాపాత్ములనూ, దివ్య సుఖాలను అనుభవిస్తున్న పుణ్యాత్ములనూ తిలకిస్తూ వచ్చాడు. యమభటులు రాక్షస వీరులను ప్రతిఘటించారు. యమ భటులు చుట్టుముట్టి రావణుని ముప్పుతిప్పలు పెట్టారు. వారి దాడికి రావ ణుని కవచం చీలిపోయింది. అతని శరీరం రక్తసిక్తమయ్యింది. రావ ణుడు యమ భటులపై పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ దివ్యాస్త్రం వివిధ రూపులను తాల్చి, యమభటులను చీల్చి చెండా డింది. యమభటులు విధ్వంసం కావడం చూసి, రావణుడు హర్షాతిరేకంతో సింహనాదం చేశాడు.
రావణుని సింహనాదాన్ని విని, యముడు తన సేన పరాజ యాన్ని గ్రహించాడు. స్వయంగా యుద్ద రంగానికి చేరుకున్నాడు. యముని కాలదండం మూర్తీభవించి యముని ప్రక్క నిలిచింది. కాల పాశములు రూపులు తాల్చి యమునికి ప్రోద్బలంగా చుట్టూ నిలిచాయి. యమ రావణుల మధ్య మహా భయంకర సంగ్రామం జరిగింది. అది చూసి దేవతలు, రాక్షసులు నిశ్చేష్టులయ్యారు!
యముడు ప్రయోగించిన దివ్యాస్త్రాలన్నీ వ్యర్థమయ్యాయి. యముడు కాలదండాన్ని ప్రయోగించాలని నిశ్చయించాడు. యముని తలంపు తెలుసుకుని బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ”యమ ధర్మరాజా! కాల దండాన్ని రావణునిపై ప్రయోగించవద్దు. రావణు డు మానవులకు తప్ప ఇతరులకు అవధ్యుడని వరం ప్రసాదించా ను. కాల దండం వ్యర్థం కాదు| అనే నిర్ణయం కూడా నాదే! నీవు కాల దండాన్ని ప్రయోగిస్తే వైరుధ్యం వల్ల నేను అసత్యవాదిని అవుతాను. నేను అసత్య వాదిని అయితే ముల్లోకాలు అసత్యానికి ఆశ్రయాలు అవుతాయి” అన్నాడు. యముడు బ్రహ్మ వాక్కును శిరసావహించి, కాల దండాన్ని ప్రయోగించకుండా అంతర్ధానమయ్యాడు. రావణు డు కృతకృత్యుడై స్వయంగా విజయాన్ని ప్రకటించుకుని సింహనా దం చేశాడు. రాక్షస సేన విజయ భేరి మ్రోగించింది. రాక్షస సైన్యంలో ఆనందోత్సహాలు వెల్లి విరిసాయి.
కాలకేయ నివాతకవచులపై విజయం
రావణుడు విజయోత్సాహంతో రాక్షస సేనను రసతలానికి పరుగు తీయించాడు. నాగ జాతి రాజధాని భోగవతిపై దాడి చేసి, నాగు లను చిత్తు చేశాడు. పిమ్మట నివాతకవచుల నివాసం మణిపురంపై దండెత్తాడు. రావణుడు నివాత కవచులను యుద్దానికి ఆహ్వానించాడు. ఇరు బలాలు ఒక్క సంవత్సరం పాటు హోరాహోరి పోరాడాయి. వివిధ ఆయుధ సంపన్నులై ఒకరికొకరు తీసిపోకుండా పోరాడారు. రావణ నివాతకవచుల సంకుల సమరం ముల్లోకాలను సంక్షోభంలో చిక్కుకున్నాయి. మీరు యుద్దాన్ని విరమిస్తే శుభం కలుగుతుంది. లోకాలకు శ్రేయస్సు చేకూరుతుంది” అన్నాడు. బ్రహ్మ మాటను శిరసావహించి, రావణ నివాతకవచులు అగ్ని సాక్షి స్నేహం చేశారు. రావణుడు స్నేహ భావంతో ఒక్క సంవత్సరం నివాత కవచుల అతిథ్యాన్ని స్వీకరించాడు. వారి నుండి నూరు మాయా విద్యలను గ్రహించాడు. స్వస్థానమైన లంకానగ రంలోకంటే అధిక సుఖసంతోషాలతో వైభవంగా జీవించాడు.
తరువాత వరుణుని జయింప తలచి అతని రాజధాని కొరకు గాలించాడు. రసాతలమంతా అన్వేషించాడు. అతనికి కాలకేయుల రాజధాని అశ్మనగరం కనిపించింది. రావణుడు కాలకేయులపై దాడి చేశాడు. శూర్పణఖ భర్త విద్యుజ్జిహ్వుడు రాక్షసులను భక్షించడం చూసి, అతని తల నరికాడు. తరువాత వరుణపురి రావణుని కంట పడింది. రావణుడు వరుణుని సేనాపతులపై పడి చావుదెబ్బ తీశా డు. ”రావణుడు యుద్ధానికి ఆహ్వానిస్తున్నాడని మీ రాజుకు తెల పం డి పొండి” అని తరిమాడు. వరుణుని కొడుకులు కామన శక్తిగల రథాలతో యుద్ధ రంగానికి వచ్చారు. మరీచాది రాక్షస మంత్రులు, సేనాపతులు విజృంభించి, వరుణుని సేనను చీల్చి చెండాడారు. వరుణుని కొడుకులు పుష్పకమందున్న రావణుని చూసి తమ రథా లతో కూడ ఆకాశానికి ఎగిరారు. వారు ఆకాశం నుండి యుద్ధం చేశా రు. పరస్పర బాణ వృష్టి కురిపించారు. వరుణుని కొడుకులు అసా ధారణ పరాక్రమాన్ని ప్రదర్శించి, రావణుని గాయపరిచారు.
రావణుడు రక్తసిక్త శరీరుడు అయ్యాడు. ఆ దృశ్యం చూసి మహోదరుడు అగ్రహోదగ్రుడై గదను గిరగిర త్రిప్పుతూ వరుణ సుతులను మోదాడు. గదా ఘాతాలకు గాయపడి వారు నేల పడ్డా రు. వారు తేరుకుని మరల ఆకాశానికి ఎగిరి బాణ ప్రయోగంతో మహోదరుని చిత్తు చేశారు.
రావణుడు రోషపూరితుడై వరుణుని కొడుకుల మర్మ స్థానాలను భేధించాడు. వారు అలసి గాయపడి నిరుత్సాహులు అవడం చూసి, రావణుడు చెలరేగిపోయాడు. రావణుని విజృంభణ ను ఎదిరించి నిలువలేక, వరుణ పుత్రులు యుద్దభూమి నుండి అదృశ్యమయ్యారు. వరుణుని మంత్రులు రావణుని ముందు నిలి చారు. ”రావణా! వరుణుని కొడుకులు నీకు ఓడి యుద్ధ రంగం విడి చారు. వరుణుడు బ్రహ్మ లోకానికి పోయాడు. ఇక బలహీనులపై నీ పరాక్రమం చూపడం ఏమాత్రం ఉచితమో నీవే ఆలోచించుకో” మన్నారు.
రావణుడు తనకు తానే విజయాన్ని ప్రకటించుకున్నాడు. తన కంటికి నచ్చిన కన్యలను బలవంతంగా చెరపట్టాడు. రాజులు, ఋషులు, దేవతలు, గంధర్వులు మున్నగు జాతుల సుందరాంగు లను దౌర్జన్యంగా లంకకు కొని వచ్చాడు. అడ్డుపడిన వారి బంధు మిత్రులను నిర్దాక్షిణ్యంగా దారుణంగా చంపి, నచ్చిన స్త్రీలను పుష్ప క విమానం ఎక్కించాడు. వారందరూ రావణుని పరస్త్రీ వ్యామో హాన్ని అసహ్యించుకున్నారు. ”ఇందరిని చెరపట్టి హింసిస్తున్నాడు. ఈ దుర్మార్గుడు స్త్రీ కారణంగానే మరణిస్తాడు” అని శపించారు.
రావణుడు లంకానగరంలో ప్రవేశించగానే శూర్పణఖ హృద య విదారకంగా రోదిస్తూ రావణుని పాదాలపై పడిపోయింది. సోదరి శూర్పణఖను చూసి ”ఏడుస్తున్నావేమి?” అని అడిగాడు రావణుడు. ”నీవు ఎంత శౌర్యపరాక్రమ సంపన్నుడవు అయితే మాత్రం, క్రూరాత్ముడవై సోదరి భర్తను చంపుతావా? తోబుట్టువు భర్త అనే అభిమానం ఆవగింజంత అయినా లేకుండా చంపడం నీకే చెల్లింది! సోదరి పసుపు కుంకుమల రక్షణ కొరకు సోదరులు ఆరాట పడతారు. నీవు విపరీత బుద్దివై తోబుట్టువును చేతులారా విధవను చేస్తావా? ఇంతటి కిరాతక చర్యకు పాల్పడే సోదరుడు ముల్లోకాలలో ఎక్కడైనా ఉన్నాడా? నీవు ఒక సోదరుడివేనా? ఎందుకు ఏడుస్తు న్నావని అడుగుతున్నావా, సిగ్గులేదా?” అని శూర్పణఖ ఏడ్చింది.
క్రోధాత్ముడనై కాలకేయులతో యుద్ధం చేస్తూ ఖడ్గాన్ని పలు దిక్కులా ఝులిపిస్తున్నప్పుడు యాదృచ్చికంగా ఖడ్గప్రహారానికి బలి అయ్యాడు. జరిగిపోయిన దానికి వగచినందువల్ల ప్రయోజ నం ఏముంది? నీకు సుఖాలను, అధికారాన్ని కల్పిస్తాను. మన పిన తల్లి కొడుకు ఖరుడు నీ సలహాలను స్వీకరిస్తూ, నిన్ను సంప్రదిస్తూ జన స్థానాన్ని పాలిస్తాడు. మన దూషణుడు సర్వ సేనాధిపతియై నీ అజ్ఞాను వర్తియై వరిస్తాడు. 14వేల మంది రాక్షస నాయకులైన ఖర దూషణులపై పెత్తనం చెలాయి స్తూ, నీవు యధేచ్ఛగా విహ రించవచ్చు అని రావణుడు శూర్పణఖను ఊరడించాడు.
– కె.ఓబులేశు
9052847742

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News