Tuesday, October 26, 2021

మహాదుర్గ

సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ద సాధికే
త్య్రంబకే దేవి మహగౌరి నమోస్తుతే!

దుర్గా నవరాత్రులలో అష్టమినాడు అమ్మను మహాదుర్గగా ఆరాధిస్తా రు. పంచ ప్రకృతి రూపాలలో మొదటిది దుర్గా రూపము. భవబంధాలలో చిక్కుకున్న మానవులను ఉద్ధరించే మాత దుర్గాదేవి. కోటి సూర్య తేజముతో దుర్గా రూపము భక్తులకు కనువిందు చేస్తుంది. సింహ వాహనముపై అధిరోహంచి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తుంది. దుర్గముడనే రాక్షసుని సంహరించి, దుర్గతులను నాశన మొనరించి నందువలన ఈమెను దుర్గాదేవి అని కూడా పిలుస్తారు. ఏ రోజైతో నవమితో కలసిన అష్టమి యగునో దానికి మహాష్టమి అని పేరు. దుర్గాదేవి ”లోహుడు” అనే రాక్షసుని అష్టమినాడు వధించినది. ఈ రోజు లోహా లను పూజిస్తే మేలు కలుగుతుంది. దుర్గలోని ‘దుర్‌’ అంటే దు:ఖము, దుర్భిక్ష్య ము, దుర్వ్య సనము, దారిద్య్రము మొదలైనవి అని అర్థం మరియు ‘గ’ అంటే నశింపచేసేది అని అర్థము. అందువలనే దుర్గ అంటే దుర్గతు లను తొలగించే దుర్గేయురాలు. దుర్గను ఆరాథన విధానములో ‘దుం’ అనే బీజాక్షరా న్ని కలిపి పూజ చేస్తారు. దుర్గాష్టమి మంగళ వారముతో కలసిన మరింత శ్రేష్టముగా చెప్ప బడుతోంది. దుర్గను ఆరాధించటం వలన భూత, ప్రేత, పిశాచ, రక్కసుల బాధలు కలుగవు.
దుర్గా స్తోత్రం
నిస్తుల నీలచికురా నిరపాయా నిరత్యయా
దుర్లభా దుర్గమా దుర్గా దు:ఖ హంత్రీ సుఖప్రదా
దుష్టదూరా దురాచారశమనీ దోషవర్జితా
సర్వజ్ఞా సాంద్రకరుణా సమానాధిక వర్జితా!
ఈ రోజు దుర్గాసప్తశతి, చండీ పారా యణ, దుర్గా స్తోత్రము విశేష ఫలదాయ కము. ఎరుపు రంగు వస్త్రములు, ఎరుపు రంగు పూవులు అమ్మవారికి సమర్పించాలి. అమ్మవారికి పొంగలి, పులిహోర, పులగం నైవేద్యంగా సమర్పించాలి.
విజయవాడలోని కనకదుర్గమ్మ ఈరోజు మహాదుర్గగాను, శ్రీశైలం భ్రమరాంబ కాళ రాత్రి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు.
నల్లని ఛాయతో గాడిదను వా#హనంగా చేసుకుని, కురులను విరబోసుకుని భక్తులకు సర్వ శుభాలను ప్రసాదించే అవతారం కాళ రాత్రి. ఈ తల్లి ఎప్పుడూ శుభ ఫలితాలని స్తుంది. నల్లని రంగు అజ్ఞానానికి ప్రతీక. ఈమె నల్లని వర్ణములో వుండుటవలన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇందు వలన ఈమెను శుభంకరి అని కూడా పిలు స్తారు. ఈ తల్లిని ఆకుపచ్చ వర్ణం వస్త్రాలతో అలంకరించి దద్దోజనం, చక్కెర పొంగలి నైవే ద్యంగా సమర్పించాలి.

కాళరాత్రి శ్లోకము
ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా!
లంబోష్టీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ!!

– డా. దేవులపల్లి పద్మజ
98496 92414

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News