Tuesday, July 27, 2021

బలరామకృష్ణుల అవతరణ

భూలోకంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణ అనే కారాలను నిర్వర్తించ డానికి యుగయుగాన శ్రీకృష్ణ పరమాత్మ తన దేవగణం తో అవతరిస్తూనే ఉన్నాడు. ఆదిశేషుని అవతారమైన బల రాముడు శ్రీకృష్ణ పరమాత్మకు అన్నగా అవతరించాడు. విభిన్న యుగములలో వివిధ శరీర ఛాయలతో శ్రీకృష్ణుడు అవతరించా డు. శ్వేత, రక్త, పీత, కృష్ణ వర్ణములతో ప్రకాశించాడు. కృష్ణ వర్ణమ నగా నలుపు, నీలిరంగుల కలయిక. ఆకాశం రంగు కృష్ణ వర్ణము.
సంపూర్ణమైన అవతార లీలలను ప్రదర్శించిన శ్రీకృష్ణ పరమా త్మ తనను నమ్మిన భక్తులకు యోగ్యమైన జీవన పథాన్ని ఏర్పరచి తుదకు ముక్తిని ప్రసాదిస్తాడు. భూమికి అధిష్టాన దేవత అయిన భూదేవి రాక్షస ప్రవృత్తిగల రాజుల వలన ఉపద్రవం వస్తుందని, సాధురూపమైన గోవుగా కన్నీటితో బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి విన్నవించుకుంది. అప్పుడు బ్రహ్మ శివునితో సహా సమస్త దేవగణ మును వెంటబెట్టుకొని క్షీరసాగర శయనుడైన శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి స్తుతించారు. ”పూర్వము దివ్యవరాహముగా అవత రించి కాపాడిన భూమి ఇప్పుడు అధర్మముతో, రాక్షస ప్రవృత్తితో సృష్టికి విరుద్ధముగా మారినదని, దానిని పరిరక్షించమ”ని కోరారు. పురుష సూక్తముతో స్తోత్రము చేస్తున్న దేవగణమున బ్రహ్మకు శ్రీ మహావిష్ణువు సందేశము చేరింది. ”తేనే బ్రహ్మ హృదా” అనగా విష్ణ సందేశము ముందుగా బ్రహ్మ హృదయ మును చేరుతుంది. బ్రహ్మ విష్ణు సందేశమును దేవతలందరికి ఈవిధముగా ప్రకటిస్తాడు.
”శ్రీ మహావిష్ణువు తన దివ్యశక్తులతో అతి త్వరలో భూలోకం లో అవతరిస్తున్నాడు. కావున దేవతలందరూ తమతమ పాత్ర లను నిర్వర్తించుటకు యదు వంశమున జన్మించమని ఆదేశిం చాడు. ఆ తరువాత భూదేవిని ఓదార్చి బ్రహ్మలోకానికి వెళ్ళి పోతాడు.
యదువంశ ప్రముఖుడైన శూరసేనుడు మధుర దెెశాన్ని మధురను రాజధానిగా చేసుకొని ధర్మనిష్టతో పరిపాలన చేస్తున్నా డు. అతని కుమారుడగు వసుదేవుడు. దేవకుని కుమార్తె అయిన దేవకిని వివాహం చేసుకొని మధురకు వెళుతుంటాడు. వరుసకు దేవకి సోదరుడైన కంసుడు స్వయముగా రథాన్ని నడుపుతున్నా డు. ఆ రథము వెనుక అపారమైన కానుకలతో రథాలు, తురగాలు, గజాలు, దాసదాసీ గణము అనుసరించాయి. వివిధ సంగీత వాద్య ములు మిన్నంటి మ్రోగుతున్నాయి. ఆ శుభ సమయంలో హఠాత్తు గా ఆకాశంలో అశరీర వాక్కు వినపడుతుంది.
”అవివేకివైన ఓ కంసా! అష్టమ గర్భమున నీ సోదరి నీ మృ త్యువుకు జన్మనిస్తుంది. అంటే ఎనిమిదవ శిశువు నిన్ను హతమారు స్తుంది” అని పలుకుంది.
కంసుడు భోజ వంశజుడైన ఉగ్రసేనుని కుమారుడు. అత్యంత రాక్షస ప్రవృత్తి కలవాడు. అశరీరవాణి వాక్కులు విన్న వెంటనే కం సుడు తన కరవాలాన్ని దూసి సోదరి అయిన దేవకిని చంపడానికి పూనుకుంటాడు. కంసుని హఠాత్తు చర్యకు హతాశుడైన వసుదేవు డు ”మరణము అనివార్యము. అటువంటి మరణానికి నీవంటి శూరుడు భయపడటం అవమానము. నూతన వధువైన నీ సోద రిని మరణ భయంతో చంపడం సరికాదు. అది నీ కీర్తికి పూర్తి భం గం కలిగిస్తుంది.” ఇలా ఎన్ని విధాలుగా ప్రాధేయపడినా కంసుని రాక్షస ప్రవృత్తి ప్రజ్వలిస్తూనే వుంది. చివరికి ”దేవకికి కల్గిన పుత్రు లందరినీ పుట్టగానే నీకు సమర్పిస్తాను” అని వసుదేవుడు మాట ఇవ్వగా కంసుడు తన కరవాలాన్ని ఉపసంహరించుకుంటాడు.
నారదుని రాకతో మనసు మారిన కంసుడు దేవకీ వసుదేవు లను కారాగారంలో బంధించి ప్రతి సంవత్సరం దేవకికి జన్మిం చిన మగశిశువులను వధించడం మొదలుపెట్టాడు. కంసుడు పూర్వ జన్మ లో కాలకేమి అనే రాక్షసుడు. విష్ణువుచే వధింపబడతాడు. మరణ భయంతో తండ్రి ఉగ్రసేనుని, వసుదేవుని తండ్రి శూరసేను ని, వసుదేవుని మిగిలిన భార్యలను చెరసాలలో బంధిస్తాడు.
ఒక భార్య రోహిణి మాత్రం నందవ్రజములో వసుదేవుని స్నేహితు డైన నందుని రక్షణలో వుంటుంది. రాజ్యములన్నింటినీ ఆక్రమిం చిన కంసుడు అత్యంత క్రూరమైన పాలన చేస్తుంటాడు.
దేవకి సప్తమ గర్భంలో అనంతుడైన ఆదిశేషుడు ఉన్నాడు. ఆ సమయంలో శ్రీకృష్ణునిగా అవతరించడానికి ఉద్యుక్తుడవున్న పరమాత్మ యోగమాయకు ఈవిధంగా చెబుతాడు.
”చెరసాలలోవున్న దేవకి గర్భంలో శేషుడు ఉన్నాడు. శేషుని దేవకీ గర్భం నుండి నందుని రాజ్యంలోవున్న రోహిణి గర్భానికి మార్చు. తరువాత నేను నా సంపూర్ణ శక్తులతో దేవకి గర్భంలో అవతరిస్తాను. దేవకి గర్భం నుండి రోహిణి గర్భంలో సంరక్షణ చేయుట వలన సంరక్షకునిగా, జీవితాంతం అత్యున్నత ఆనందం, బలవంతుడిగా వుండటంవలన బలరాముడిగా ప్రసిద్ధి పొందు తాడు. తదుపరి నీవు నంద యశోదలకు కుమార్తెగా జన్మించుము” అని ఆదేశిస్తాడు.
అప్పుడు యోగమాయ శ్రీకృష్ణ పరమాత్మ ఆజ్ఞానుసారం పృథివిపై అవతరిస్తుంది. దేవకి గర్భం నుండి బలరాముని రోహిణి గర్భంలోకి మార్చింది. దేవకికి గర్భస్రావమైందని అందరూ భావించారు. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ తన సంపూర్ణ శక్తులతో వసుదేవుని మనసులో ప్రవేశిస్తాడు. దేవకీ దేవి హృదయంలో ప్రకాశించాడు. రోహిణీ నక్షత్రం బ్రహ్మ పర్యవేక్షణలో వుండగా గ్రహ మండలం తనంత తానుగా శుభకరమైన ఉచ్ఛస్థితికి మారు తుంది. నదులు ప్రశాంతంగా, నిండుగా ప్రవహించాయి. పక్షులు మధుర గానాలు పలికాయి. నెమళ్ళు ఆనందంతో నృత్యం చేసాయి. గోవులు ఉత్సాహంతో గంతులు వేసాయి. యజ్ఞకుండాలు హోమాగ్నితో పరిమళించాయి.
ఆ శుభ సమయంలో ధర్మసంస్థాపనార్థం చతుర్భాహువు, శంఖము, చక్రము, గద, పద్మములతో పీతాంబరధారి కౌస్తుభ మణిని ధరించిన శిశువు దేవకికి జన్మించడాన్ని వసుదేవుడు చూసా డు. అప్పుడే పుట్టిన ఆ శిశువు ”అనేక జన్మల సుకృతము వలన తిరిగి మీకు కుమారుడిని అయ్యాను. నన్ను తక్షణమే గోకులానికి చేర్చి యశోదకు జన్మించిన శిశువుతో మార్పిడి చేయమని” వసుదేవుని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే ఒక సామాన్య శిశువుగా మారి మౌనంగా చిరునవ్వులు చిందించ సాగాడు.
భూమండలంలో శ్రీకృష్ణ యోగమాయ ఆవహించగా స్వేచ్ఛ గా బాలకృష్ణుని తన ఒడిలోకి చేర్చుకొని ఆదిశేషుడు ఛత్రమ వ్వగా శుభసూచనగా వర్షం కురుస్తుంటే యమునా నది దారి చూపగా నందగోకులంలో నంద మహారాజు భవనాన్ని చేరిన వసు దేవుడు యోగమాయ అయిన శిశువును తీసుకుని చిన్నికృష్ణుని యశోద పక్కన పడుకోబెట్టి తిరిగి కారాగారం చేరి దేవకి ఒడిలో యోగమా యను వుంచుతాడు. తక్షణమే తిరిగి పరిస్థితులన్నీ మామూలు స్థితికి వస్తాయి. యోగమాయ ప్రభావంతో నిద్రించిన ద్వారపాల కులు, సైని కులు శిశు రోదన విని పరుగు పరుగున కంస మహారాజు దగ్గర కు వెళ్ళి విషయం చెబుతారు. వెంటనే కంసుడు అరివీర భయంకరుడై కరవాలము చేతబట్టి అష్టమ శిశువును వధించడానికి బయలుదేరతాడు. ”స్త్రీ శిశువును వధించుట భావ్యముకాదని, నిన్ను వధించు వాడు పురుషుడని ఆకాశవాణి తెలిపిందని, కరుణ చూపమని” ప్రాధేయపడుతుంది దేవకి. క్రూరుడైన కంసుడు పాషాణ హృదయుడై దేవకి ఒడి నుండి ఆ శిశువును లాగుకొని పైకె త్తగా, ఆ శిశువు ఆకాశంలోకి ఎగిరి అష్టబాహువులతో దుర్గాదేవిగా ప్రత్యక్షమవుతుంది.
”నిన్ను చంపేవాడు ఇప్పటికే జన్మించాడు” అని చెప్పి అంత ర్థానమవుతుంది. లీలామానుష విగ్రహుడు, ఆర్తత్రాణ పరాయ ణుడు, ధర్మస్థాపనా దురంధరుడు అయిన శ్రీకృష్ణపరమాత్మ తన పరివారముతో ఈవిధంగా అంతరిం చాడు. ”కృష్ణం వందే జగద్గురుం.”

– వారణాశి వెంకట సూర్యకామేశ్వరరావు
8074666269

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News