Sunday, October 17, 2021

బంగారు బతుకమ్మ

ప్రకృతిని ఆరాధించే మహోన్నత వారసత్వానికి ప్రతీక బతుకమ్మ పండగ. సమాజపు సమిష్టి తత్వాన్ని, కుటుంబంలో మహిళల ప్రాధాన్యతను గౌరవాన్ని చాటి చెప్పే పండగ బతు కమ్మ. బతుకమ్మ బ్రతుకుని కొలిచే పండగ. బతుకునిచ్చే తల్లిని శక్తి రూపంగా భావిస్తూ, అమావాస్య నుండి దుర్గాష్టమి వరకు లక్ష్మీ, గౌరి దేవిలను అభే దిస్తూ, ఆట, పాటలతో పూజిస్తూ రక రకాల నైవేద్యాలు సమర్పిస్తూ, ఆడబిడ్డల్ని పండగకు ఆహ్వా నించుకుని జరుపుకునే గొప్ప వేడుక బతుకమ్మ. భాద్రపద బహుళ అమావాస్య రోజు ఎంగిలి పూల బతు కమ్మను పూజించడం సంప్రదాయం. ‘మహర్నవమి’గా నవ మి రోజు ‘సద్దుల బతుకమ్మ పండగ’ పేరుతో పెద్ద ఎత్తున బతు కమ్మ పేర్చుకొని వైభవంగా జరుపుకుంటాం. తీరు, తీరు పూలతో, తీరైన వంటలతో తల్లిని కొలుస్తూ పాడే పాటలు జీవితంలో ఎదురయ్యే సన్నివేశాలతో కూడిన పాటలు, సద్దుల బతుకమ్మ రోజు పొద్దుటినుండే హడావుడిగా ఉంటుంది. పండగ ఉత్సాహం ఈ రోజు అధి కంగా కనిపిస్తుంది. దసరా పండగకు ముందు రోజున ఈ బతు కమ్మ పండగ. ఇప్పటికే ఆడపడచులందరు పుట్టింటికి చేరడంతో ఇళ్ళన్నీ కోలాహలం గా ఉంటాయి. అంతేకాదు ఈనాటి బతుకమ్మను ఎక్కువ పూల తో చాలా పెద్దగా చేసి ఐదు రకాల సద్దులు, లేక తొమ్మిది రకాల సద్దులు కలిపి నైవేద్యంగా తయారుచేస్తారు. గునుగు, తంగేడు పూలతో పాటు రంగు రంగుల పూలు వలయాకారంగా, ఆకర్షణీయంగా ఉండేవిధంగా బతుకమ్మ ను తయారు చేస్తారు. శ్రీ చక్రోపాసనం, సర్వోత్కృష్టమైన శక్తి ఆరాధన విధానాల్లో ఒకటి. బతుకమ్మని పేర్చేటప్పుడు కమ లం, షట్చక్రమ్‌, అష్టదళ పద్మాన్ని వేసి పేర్చడం మొదలు పెడతారు. ఇలా బతుకమ్మను పూర్తిగ పేర్చాక బతుకమ్మ పైన పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టి బతుకమ్మ లక్ష్మీ, సరస్వతిగా భావించి పూజిస్తారు. గ్రామంలోని గుడి ముందర లేదా ఖాళీస్థలంలో బతుకమ్మను ఆడేచోట వెంపలి చెట్టు గాని, పిండి చెట్టు గాని పెట్టి గౌరమ్మను నిలిపి పూజ చేసి ఆట ప్రారంభి స్తారు. ”శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ”, ”శ్రీగౌరి నీపూజ ఉయ్యాలో….” ఇలా పాడుతూ శుభము కలగాలని గౌర మ్మని వేడుకుంటారు మహిళలు. ఆట అయ్యాక పసుపు గౌరమ్మను తీసి బతుకమ్మను చెరువులో నిమ జ్జనం చేస్తారు. ఆ పై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో, పసుపు గౌర మ్మతో వాయనాలు, నైవేద్యాలు పంచుకుంటారు.
ముందు తరాలకీ ఈ ఘనమైన వారసత్వంని ఆత్మీయంగా అందిద్దాం. అందమైన బతుకమ్మ పాటలు మనసారా పాడుకో వాలి. బతుకమ్మ ఆటతో బ్రతుకు బంగారమవ్వాలి.

– టి.సంయుక్తా కృష్ణమూర్తి
8500175459

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News