Thursday, May 26, 2022

ప్రాచీన హిందూ సంస్కృతికి అక్షరరూపం

హిందువుల సంస్కృతిలో సింహభాగం పురాణాలలో కనబడుతుంది. వీటిలోని కథలలో భక్తి, జ్ఞానం, నదులు, పర్వతాలు, పట్టణా లు, నీతులు, నాటి విద్యల్లాంటి మరెన్నో విశేషాలు కనబడతాయి. పురాణ పఠనం వల్ల విజ్ఞానం, వాఙ్మ యంవల్ల కలిగే ఆనందం లభిస్తాయి.
ప్రాచీన హిందూ వాఙ్మయంలో మహాపురా ణాలు, ఉప పురాణాలు, ఔప పురాణాలు ఏభై నాలుగు వున్నాయి. పూర్వం వీటిని దేవాలయా లలో ప్రవచనాలు చేయించేవారు. వీటికోసం దాతలు మాన్యాలిచ్చేవారు.
పురాణాలలో అష్టాదశ మహాపురాణాలు ప్రసిద్ధమైనవి. ఇవి సంస్కృత భాషలో ఉన్నాయి. వీటిని తెలుగువారికి అందించడం కోసం మారన, నంది మల్లన, ఘంట సింగయ మొదలయిన కవు లు పద్య గ్రంథాలుగా రచించారు. శ్రీనాథుడు మొదలైన మహాకవులు కొన్ని భాగాలను పద్యగ్రం థాలుగా వెలయించారు. అల్లసాని పెద్దన మొదలైన మహాకవులు పురాణ కథలతో మహాకావ్యాలు వ్రాశారు.
జనం సంస్కృతం, పద్యకావ్యాలు చదివి అర్థం చేసుకోలేని కాలం వచ్చింది. కొందరు పురా ణాలను తెలుగులోకి అనువాదం చేసి ప్రచురిం చారు. పత్రికలు ధారావాహికాలుగా ప్రచురిం చాయి. కొన్ని గ్రాంధిక వచనాలుగా వెలువడ్డాయి.
సామాన్య పాఠకులకు సరళ వ్యావహారిక భాషలో జయంతి చక్రవర్తి ‘పురాణ దర్శనము’ అనే పేరుతో రచించగా పావని సేవాసమితి మొత్తం 18 పురాణాలను మూడు సంపుటాలుగా ముద్రిం చారు. ఈ గ్రంథాలను ఉచితంగా తెలుగువారికి కానుకగా ఇస్తున్న రచయితని, ఈ సమితిని తెలుగు వారందరూ అభినందించాలి. పురాణ దర్శనము మొదటిభాగంలోవున్న ఆరు పురాణాల్లోకి వెళితే-
బ్రహ్మపురాణంలో సృష్టి, మన్వంతరాలు, సూర్యుని జననం, ప్రాచీనుల వంశాలు, నరకాలు, ప్రసిద్ధ తీర్థాలు, భారత వర్షంలో విశేషాలు ఉన్నా యి. ఏకామ్ర క్షేత్రం, కోణార్క, ఉత్కలం, పూరీ మొదలయిన క్షేత్రాల విశేషాలు, ధర్మాలు, యుగాం తంలో మానవుని ప్రవృత్తి, అన్నదాన మహిమ, ఆదిత్యసోముల జననం, శ్యమంతకమణి కథ, రుద్రుని గాథ, గౌతమీనదీ మహత్మ్యం. హరి అంశా వతారాలు, శ్రీకృష్ణుని అవతార కథ, యోగం, జ్ఞానం, మోక్షం మొదలయినవి వున్నాయి.
పద్మపురాణంలో అయిదు ఖండాలున్నాయి. లక్ష్మీదేవి జననం, గర్భవతులు పాటించదగినవి, ప్రహ్లాదుడు, కర్ణార్జునులు మొదలైనవారి వృత్తాం తాలు, నూట ఎనిమిది దేవీక్షేత్రాలు, గాయత్రీదేవి మహిమ, సరస్వతీ తీర్థం, బ్రహ్మక్షేత్రాలు, దానం గొప్పదనం, తులసి మహత్త్వం, ఉసిరి గొప్పదనం, భక్తి, ధర్మం, తల్లిదండ్రుల సేవకు ఫలం, పుష్కర మహాత్మ్యం, గయ గొప్పదనం, వైష్ణవ ధర్మం, చెట్లు నాటే విధానం, తారకాసుర సమరం, బ్రహ్మాండం పుట్టుక, శ్రీరాముని అశ్వమేధం, వైశాఖమాస మహాత్మ్యం, కురుక్షేత్రం, ప్రయాగ, కాశీ, గయ క్షేత్రాల విశిష్టత, ఏకాదశుల మహత్త్వం, భక్తి, విష్ణు వు అవతారాలు, రామభక్తి, నామమహిమ, గ్రహ పూజ మొదలయిన అనేక విశేషాలీ పురాణంలో ఉన్నాయి.
ఇక విష్ణుపురాణంలో సృష్టి, ప్రళయం, కాల స్వరూపం, సాగర మథనం, ధ్రువాదుల చరిత్రలు, వేద శాఖలు, విష్ణువు ఆరాధన ఫలం, ప్రేతకర్మ విధు లు, బలరాముని కథ, జడభరతుని చరిత్ర, వేదవా ్య సముని చరితము, శ్రీకృష్ణుని జీవిత కథ, ముల్లో కాల వర్ణనం, కౌశిక వంశం, ఊర్వశీపురూరవుల కథ, పృథు చరిత్ర, నవగ్రహాలు, జ్యోతిర్మండలం, సూర్యమహిమ, మన్వంతరాలు, ఉపనయనం, వివాహం మొదలయిన సంస్కారాలు, రాజవం శా లు, యుగధర్మాలు, బ్రహ్మతత్త్వం దీనిలో ఉన్నా యి.
వాయు పురాణంలో పరమేశ్వర ధర్మాలు, సన్యాసులకు ప్రాయశ్చిత్తాలు, మృత్యువును సూచించేవి, ప్రణవం గొప్పదనం శివుని అవతా రాలు, అక్షరాల పుట్టుక, సప్తర్షుల వంశాలు, దక్ష ప్రజాపతి కథ, కాల పురుషుడు, భూమిపై ఉన్న దివ్య పర్వతాలు, కుబేరుని నగరం, లింగోద్భవ చరిత్ర, శుక్రుని కథ, విష్ణువు అవతారాలు, శివపు రం, శివనామాలు, ఋషుల విశేషాలు, పాశుపతం, యోగం, కార్తవీర్యార్జున కథ మొదలయినవి వున్నా యి. శ్రీమద్భాగవతం. సామాన్యంగా పురాణంలో అయిదు లక్షణాలు కనబడతాయి. భాగవతంలో పది లక్షణాలున్నాయి. నారద మహర్షి పూర్వజన్మ కథ, పరీక్షిత్తు జననం, విష్ణు విరాడ్రూపం, అవతా రాలు, భక్తి స్వరూపం, మోక్షం, దేవుని మాయ, కాల విశేషాలు దీనిలో చెప్పారు.
సృష్టి, కపిలముని సాంఖ్యం, ధ్రువుడు, అజా మిళుడు, ప్రహ్లాదుడు, అంబరీషుడు, గజేంద్రుడు మొదలయిన భక్తుల చరిత్రలు, శ్రీకృష్ణావతార చరిత్ర, దత్తాత్రేయుని ఇరవై నలుగురు గురు వులు, పద్దెనిమిది సిద్ధులు, సన్న్యాస నియమాలు, శ్రీకృష్ణు ని బోధలు ఈ గ్రంథంలో ఉన్నాయి.
కలియుగ లక్షణాలు, శ్రీశుకోపదేశం, పరీక్షిత్తు ముక్తి పొందడం, సర్పయాగం, పరబ్రహ్మ తత్త్వం, సూర్యుని రూపాలు, వేదశాఖలు, అష్టాదశ పురా ణాల పట్టిక దీనిలోనివే. రచయిత చివర చతుశ్శోక భాగవతం చేర్చారు. ఫలశ్రుతితో గ్రంథం పూర్త యింది. పురాణాలలో భాగవతానికి ప్రచారం ఎక్కు వ. దీనిలో పురంజనోపాఖ్యానంలో తత్త్వార్థం కథ గా చెప్పారు. జడభరతుని కథలో మూడు జన్మలు న్నాయి. నామ మహిమను తెల్పే అజామీళుని కథ ప్రసిద్ధం. ప్రహ్లాదచరిత్ర, సూర్యచంద్ర వంశాలు మొదలయిన వాటితో భాగవతం మహోజ్జ్వలంగా ఉంటుంది.
నారద పురాణం- ఇతిహాస పురాణాలలో నారద పాత్ర బాగా ప్రసిద్ధం. ఆయన పేరుతో ఉన్న ఈ పురాణంలో మార్కండేయ చరిత్ర, గంగ గొప్ప దనం, తులసి పూజ, హరి అభిషేకం, శివపూజ, అన్న, జలాది దానాల ఫలం, పాపాలు, ప్రాయశ్చి త్తాలు, నరకాలు, హరి భక్తి, భగవన్నామ మహిమ, ప్రాయశ్చిత్తాలు, నరకాలు, హరిభక్తి, భగవన్నామ మహిమ, జ్యోతిషం, దేవతల మంత్రాలు, స్తోత్రా లు, కవచాలు, క్షేత్ర మహాత్మ్యాలు, కార్తవీర్యుడు, సావిత్రీదేవి అష్టోత్తర శతనామాలు ఈ పురాణంలో కనబడతాయి. భరతఖండ ప్రాశస్త్యం, దేవాలయా లు, బావి, నుయ్యి, చెరువు వీటి విశేషాలు, శ్రాద్ధాలు, సదాచారం, ధ్యానం, మోక్షం దీనిలో దర్శనమి స్తాయి.వ్యాకరణం, జ్యోతిషం, ఛందస్సు మొదల యిన విద్యలు, పద్దెనిమిది పురాణాలలో విశేషాలు కూడ ఉండడం విశేషం. పురాణ మహిమ, తిథివ్ర తాలు, మాఘ మహాత్మ్యం ఇచ్చటున్నాయి. పూరి, ప్రయాగ, కురుక్షేత్రం, హరిద్వారం, బదరి, కాంచీ పురంలోని కామాక్షి మొదలయిన క్షేత్రాల మహ త్త్వాలు కల ఈ పురాణంలో ఇరవై ఐదువేల శ్లోకాలు న్నాయి. దీనిలో శివకేశవులకు సమప్రాధాన్య ముందని చెప్పారు.
ఎంతో కష్టపడి సుమారు పదహారువందల పుటల గ్రంథం వ్రాసినందుకు రచయితను, ప్రచు రించిన శ్రీ పావని సేవాసమితిని తప్పక అభినం దించాలి. ఈ గ్రంథాలు చదివినవారికి ప్రాచీన హిందూ సంస్కృతి స్వరూపం కన్నులకు కడు తుంది. ఆరు పురాణాల సారమందిస్తోందీ సంపు టం. అందమైన బౌండు, దళసరి కాగితాలు, పెద్ద వారు, పిల్లలు చదవడానికి వీలుగా స్పష్టంగా కని పించేలా పెద్ద అక్షరాలతో ఈ గ్రంథం చూడముచ్చ టగా ఉంది. తెలుగువారు, ఆస్తికులు అయిన హిం దువులు రెండు చేతులా అందుకోదగినదీ కానుక.

పురాణ దర్శనం- 1
డా. జయంతి చక్రవర్తి
వెల: అమూల్యం
ప్రతులకు: చల్లా సాంబిరెడ్డి
శ్రీ పావని సేవాసమితి
ఇం.నెం. 3-6-499ఎ
రోడ్‌ నెం. 7,
హిమాయత్‌ నగర్‌
హైదరాబాద్‌- 500 029
సెల్‌ నెం. 99086 16366

– డా.చిఱ్ఱావూరి శివరామకృష్ణశర్మ
99634 55584

Advertisement

తాజా వార్తలు

Advertisement