Monday, October 14, 2024

పేదలు నివసించేచోట ఆలయాలు నిర్మించడం శుభపరిణామం

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి
తిరుమల, ప్రభన్యూస్‌:
టీటీడీ ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తోందని, ధార్మిక ప్రచారంలో భాగంగా పేద ప్రజలు నివాసిత ప్రాంతాల్లో ఆలయాలను నిర్మించడం శుభపరిణామని పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడుతూ జమ్మూకాశ్మీర్‌లో టీటీడీ శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించడం సంతోషకరమని, గో పరిరక్షణతో పాటు గో ఆధారిత పదార్థాలతో పలు వస్తువులను తయారు చేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా పర్యాటక రంగం దెబ్బతినిందని, పర్యాటక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రాలకు చేయూతనందిస్తామని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయంగా పర్యాటకానికి ప్రోత్సాహాలను అందిస్తామని, మోదీ ఆదేశాల మేరకు దేశంలోని 15 ప్రముఖ పర్యాటక కేంద్రాలను ప్రజలు సందర్శించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement