Friday, September 24, 2021

పవిత్ర శక్తి రూపిణి… స్త్రీ!

త్రిగుణాత్మక రూపమైన స్త్రీని ఒక శక్తి స్వరూపిణిగా పూజించే జాతి భరత జాతి. యుగయుగాలుగా స్త్రీని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టింది సనాతన ధర్మం. అవతార స్త్రీ దేవతామూర్తు లు తమ జీవితాలను ఒక ఆదర్శంగా తీసుకోమని సూచిస్తున్నాయి. పౌరాణిక చరిత్రను పరిశీలిస్తే అనేక అద్భుత స్త్రీల వృత్తాంతాలు మనలను ఆశ్చర్యానికి గురి చేస్తాయి.
నాగరికతా భ్రమలో ఉన్న కొందరికి మాత్రము ఒక్కోసారి అది వక్రముగా కనబడతాయి. ఏదిఏమైనా ఆ అపూర్వ గాథలలోని మహిమ, దైవత్వం ముందు తలవంచాల్సిందే! అవి మన కుంచిత మేధకు అందనివి. కావున శ్రేయోభావనతో పరికించిన వారి ఆచర ణాత్మక కార్యాలు మనకు మేలు కలిగిస్తాయి. వారి జీవితాల్లోని ఆనందం, వ్యథ, సాహసం, ఓర్పు, సహనం, పాతివ్రత్యం, త్యాగం, ధర్మనిరతి, వివేకం మొదలైనవి మనకు ఎన్నో పాఠాలు నేర్పుతా యి. అటువంటి స్త్రీ మూర్తులను స్మరించుకుందాం.
అహల్య ద్రౌపది సీతా తారా మండోదరి తథా!
పంచ కన్యా స్మరే నిత్యం మహాపాతక నాశిన:
అహల్య, ద్రౌపది, సీత, తార, మండోదరి వీరిని పంచకన్యలు గా కీర్తించి, స్మరించిన వారికి సకల పాపాలు నాశనమవుతాయి. సీతాదేవికి బదులుగా కుంతీదేవిని కూడ కీర్తించడం జరుగుతోంది. వీరితోబాటు సతీ అనసూయ, సావిత్రి, సక్కుబాయి, మీరాబాయి, వెంగమాంబ మొదలైనవారు కూడ పూజనీయులై ఉన్నారు.
ఎక్కడ స్త్రీలను పూజింతురో అక్కడ దేవతలు నివసిస్తారు. అక్కడి ప్రజల ఆనంద వైభోగాలతో తులతూగుతారు. మానవ జన్మకు బీజమెంత ముఖ్యమైనా క్షేత్రము లేకుండా సాధ్యంకాదు. అటువంటి పవిత్ర క్షేత్ర ధామమే స్త్రీమూర్తి.
బ్రహ్మ మానస పుత్రిక అహల్య. అత్యంత సౌందర్య రాశిగా ఆమెను సృజించాడు బ్రహ్మ. ఆమె రూపలావణ్యాలకు ముగ్ధులైన దేవతలందరూ ఆమెను పరిణయమాడాలని తహతహలాడసాగా రు. ముఖ్యంగా ఇంద్రుడు ప్రథముడిగా ఆశపడసాగాడు. అంత బ్రహ్మకు స్వయంవర పరీక్ష నిర్వహింపక తప్పలేదు. ఎవరైతే అత్యంత వేగంగా త్రిలోకాలను చుట్టి వస్తారో వారికి అహల్యనిచ్చి పరిణయం చేస్తానని ప్రకటించాడు. ఇంద్రుడు తన అపూర్వ దేవతా శక్తులతో అత్యంత వేగంతో ముల్లోకాలను చుట్టి వచ్చి బ్రహ్మతో అహల్యను తనకిచ్చి పరిణయం చేయమని కోరాడు. అదే సమ యమున ముల్లోకాలైన భువర్లోక, సువర్లోక, మర్త్యలోకాలను ఇంద్రునికంటే తక్కువ సమయంలో ప్రదక్షిణ చేసి వచ్చిన గౌతము ని గురించి బ్రహ్మకు తెలియజేయాలని నారదుడు ప్రత్యక్షమైనాడు.
గౌతమ మహాముని తన నిత్యపూజలో భాగంగా గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాడని అదేవిధంగా ఈరోజు కూడ చేస్తుండగా ఆ గోవు ప్రసవించి బిడ్డకు జన్మనిచ్చిందని, ప్రసవిస్తున్న గోవు ముల్లో కములతో సమానమని, కావున గౌతముడు ఇంద్రునికంటే ముం దుగా సఫలీకృతుడైనాడని చెప్పాడు. బ్రహ్మ నారద మాటలను గ్రహించి అహల్యను గౌతమునికిచ్చి వివాహం జరిపించాడు.
కాలాంతరమున గౌతముని తప:శక్తి క్షీణింప చేయటానికి అహ ల్యను శాపానికి గురిచేసిన ఇంద్రుడు, తిరిగి శ్రీ రామచంద్రు డు శాప విమోచనం చేసి పునీతను గావించుట మనకు తెలిసిన వృత్తాంతాలు.
ద్రుపదుని యజ్ఞఫలంగా అగ్ని నుండి ఉద్భవించిన మహా పతివ్రత ద్రౌపది. ద్రోణునిచే అవమానింపబడిన ద్రుపదుడు ద్రోణుని వధించగల పుత్రుడు, మహా పరాక్రమవంతుడైన అర్జును ని పెండ్లాడ కలిగిన పుత్రిక కొరకు యజ్ఞం నిర్వహించాడు. గత జన్మ లో ద్రౌపది ఇంద్రసేనగా మౌద్గల్య మునికి భార్యగా జన్మించింది. వ్యాధిగ్రస్తుడైన పతి సేవలో అనుక్షణం నిమగ్నమై ఉండేది. పతి సేవకు కరిగిపోయిన మౌద్గల్యుడు వరాన్ని కోరుకోమని అడిగాడు. మీ వ్యాధి నయమై నాకు పతిభిక్ష ప్రసాదించమని కోరింది. భర్తను చూస్తున్న ఆవేదనలో ఐదుసార్లు ”పతిభిక్ష” అని పలికింది. భర్త వర ప్రభావంతో ఐదు అద్భుత రూపాలతో మౌద్గల్యుడు ఆమెను అల రించేవాడు. తరువాత జన్మలో ద్రౌపది కాశిరాజు పుత్రికగా జన్మిం చింది. కన్యగానే శివుని గురించి తపస్సు నాచరించింది. శివుడు ప్రత్యక్షమైన ఆనందంలో శక్తివంతుడైన పతిని అనుగ్రహించమని ఐదుసార్లు తన అభీష్టాన్ని తెలియజేసింది.
పరమేశ్వరుడు తథాస్తు పలికి, ఇంద్రుని ఐదు మానవ రూపా ల్లో భూలోకమున జన్మించమని ఆదేశించెను. వారే ధర్ముడు, వా యు, ఇంద్ర, అశ్వినులు. అర్జునుడు మత్స్య యంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని చేపట్టుట, తల్లి కుంతీదేవి భిక్షను పంచుకొనమని పరో క్షంగా పాండవులతో పలుకుట, వ్యాస భగవానుని విశదీకరణ తరు వాత పాండవులు అయిగురు ద్రౌపదిని వివాహమాడుట మనకు తెలిసినదే!
సీతాదేవి వృత్తాంతము లోక విదితమే. శ్రీ మహాలక్ష్మి అవతార మైన సీతాదేవి మిథిలాధీశుడైన జనకుడు యాగ నిమిత్తమై స్వర్ణ హలితో భూమిని పవిత్రం చేస్తుండగా భూదేవి పుత్రికగా సీత ఒక స్వర్ణ పేటికలో లభించింది. జనకుడు, భార్య సునయన అల్లారు ముద్దుగా పెంచుకునారు.
కారణజన్మురాలైన అయోనిజ సీతాదేవిని శివధనస్సు భంగం గావించి శ్రీరామచంద్రుడు చేపట్టినాడు. రావణ సంహారానంతరం సీతాదేవి అగ్ని పునీతయై శ్రీరామచంద్రుని చేరినది.
తార మహా పరాక్రమవంతుడైన కిష్కింధాధిపతి వాలి భార్య. వీరి పుత్రుడు అంగదుడు. వానర న్యాయముననుసరించి సుగ్రీవు ని రాజ్య బహిష్కరణ చేసి అతని భార్య రుమను స్వాధీనం చేసు కున్నాడు వాలి. తదుపరి శ్రీ రామచంద్రునితో సుగ్రీవుని మైత్రి జరి గింది. ఒకసారి ఓడిపోయిన సుగ్రీవుడు తిరిగి వెంటనే అన్న వాలిని యుద్దానికి ఆహ్వానించాడు. శ్రీ రామ లక్ష్మణుల అండ చూసుకుని యుద్ధానికి వెళ్ళి శ్రీరాముని చేతిలో హతుడైన భర్త దేహముపై రోధిస్తూ తార తనను కూడా సంహరించి తన పతితో సహగమనము చేసే మార్గం చూపమని శ్రీరాముని కోరింది. శ్రీరామచంద్రుడు వాలి వధ ను సమర్ధించగా, స్వయంగా వాలియే అంగీక రించి తారను సుగ్రీవునికి హితము చేకూర్చ మని, అంగదుని యువరాజుని చేయమని చెప్పి ముక్తి పొందాడు. తరువాత తార శ్రీరామునికి సీతాన్వేషణలో సుగ్రీవునికి హితబోధ చేసి పరో క్షంగా సహాయపడింది.
మండోదరి విశ్వకర్మ పుత్రుడైన మయబ్రహ్మ కుమార్తె. అత్యం త సౌందర్యరాశి. రావణుడు ఈమెను మోహించి పట్టపు రాణిగా చేసుకున్నాడు. ఈమె తల్లి దేవకన్య అయిన హేమాదేవి. సీతను చెర బట్టిన తన పతికి భవిష్యత్తును ఊహించి ”మీ మృత్యువును మీరే స్వయంగా తీసుకు వచ్చి దగ్గరుంచుకున్నారని, సీతా సాధ్విని శ్రీరామునికి అప్పగించి లంక చేటును తప్పించమని, లేనిచో లంకా నగరంతోబాటు సమస్త రాక్షస జాతి అంతమవుతుందని హితం చెప్పింది. ఆమె మాటలను పెడ చెవిన పెట్టి అసుర జాతి నాశనానికి కారణమం అయ్యాడు రావణుడు.
ఈ ఐదుగురు మహా పతివ్రతల్లో అహల్య, ద్రౌపది, సీత, అయోనిజలు కాగా తార, మండోదరి యోనిజలు. వీరందరూ వ్యథను అనుభవించినా నారీలోకానికి ఆదర్శంగా నిలిచారు. వారి ధైర్య స్థ్యైర్యాలను, ఓర్పు సహనాలను నేటి మానవాళి స్పూర్తిగా తీసుకుంటే జీవితానికి కళ్యాణ స్థితి కలుగుతుందని చెప్పటంలో ఎటువంటి సందేహంలేదు. అందువల్లనే వీరు ప్రాత: స్మరణీయు లు. వీరి పాతివ్రత్యమే వీరిని కన్యామణులుగా కీర్తించినది.

– వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు
8074666269

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News