Friday, October 22, 2021

నేడు బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనం

అమరావతి, ఆంధ్రప్రభ: శరన్నవరాత్రి మహోత్స వాలలో శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ బాలాత్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది. శ్రీ బాలామంత్రం సమస్త దేవీ మంత్రాల్లోకి గొప్పది, ముఖ్య మైనది. అందుకే విద్యోపాస నకులకి మొట్టమొదట బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపురసుందరీదేవి నిత్యం కొలువుండే పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత ఈ బాలాదేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలం. దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం శ్రీ బాలాదేవి.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News