Saturday, May 8, 2021

నేటి రాశి ప్రభ (30-4-2021)

మేషం
ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. మీ ప్రతిపాదనలు అందర్నీ మెప్పిస్తాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృషభం
సన్నిహితులతో విభేదాలు. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని వ్యవహారాలు నిరాశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

మిథునం
పనుల్లో అవాంతరాలు. మానసిక అశాంతి. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. అనారోగ్యం. మిత్రులతో విభేదిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

కర్కాటకం
ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. నూతనంగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

సింహం
ముఖ్యమైన పనులలో విజయం. శుభవార్తలు వింటారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

కన్య
రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో కొన్ని చికాకులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు. ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

తుల
కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు.

వృశ్చికం
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

ధనుస్సు
రుణయత్నాలు సాగిస్తారు. పనుల్లో ప్రతిబంధకాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మకరం
బంధువుల నుంచి ముఖ్య సమాచారం. ధనలాభం. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆస్తిలాభ సూచనలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనూహ్య మార్పులు.

కుంభం
వ్యవహారాలలో ఆటంకాలు. కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. స్థిరాస్తి వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

మీనం
ఆత్మీయుల నుంచి ముఖ్య విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల నుంచి పిలుపు. ఇంటర్వ్యూలు అందుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూలత.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Prabha News