Friday, September 24, 2021

నేటి రాశి ప్రభ (15-9-2021)

మేషం
కొత్త వ్యక్తుల పరిచయం. శుభ వార్తా శ్రవణం. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పోటీ పరీక్షల్లో విజయం. వృత్తి, వ్యాపారాలలో
పురోగతి ఉంటుంది.

వృషభం
కొత్త పనులకు శ్రీకారం. శుభ వార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో వివాదాలు తీరతాయి. దైవ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.

మిథునం
మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు అంతగా అనుకూలించదు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

కర్కాటకం
ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో మాటపట్టింపులు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

సింహం
దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

కన్య
నూతన ఉద్యోగయోగం. చర్చలు సఫలం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభ కార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

తుల
మిత్రులతో విభేదాలు. ధన వ్యయం. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు. శ్రమ పడ్డా ఫలితం ఉండదు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక చింతన.

వృశ్చికం
వ్యయ ప్రయాసలు. ధన వ్యయం. కుటుంబ సభ్యులతో వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. విద్యార్థులకు చికాకులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

ధనుస్సు
మిత్రుల చేయూతతో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలస్థితి.

మకరం
ఆర్థిక వ్యవహారాలు నిరాశాజనకంగా ఉంటాయి. రుణ యత్నాలు. బంధు వర్గంతో మాటపట్టింపులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు.

కుంభం
పనుల్లో పురోగతి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందు వినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. ఆస్తిలాభ సూచనలు.

మీనం
మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్య భంగం. శ్రమ తప్పదు. ఆస్తి వివాదాలు. దూరపు బంధువులను కలుసుకుంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. దైవ చింతన.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News